Saturday, January 18, 2025
Homeసినిమారవితేజ ప్లేస్ లో వరుణ్ తేజ్?

రవితేజ ప్లేస్ లో వరుణ్ తేజ్?

మాస్ మహారాజ్ రవితేజ ఇటీవల క్రాక్ మూవీతో ఫామ్ లోకి వచ్చాడు. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చిన క్రాక్ సినిమా రవితేజ కెరీర్ లో అత్యధిక కలెక్షన్స్ వసూలు చేసిన సినిమాగా నిలిచింది. ప్రస్తుతం రవితేజ ఖిలాడి అనే సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. మే 28న విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడింది. ఇదిలా ఉంటే.. రవితేజ, నక్కిన త్రినాధరావు దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారని వార్తలు వచ్చాయి.

త్వరలో ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుంది అనుకుంటే.. ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యిందని టాక్ వినిపిస్తోంది. దీంతో ఈ ప్రాజెక్ట్ ఎందుకు క్యాన్సిల్ అయ్యింది అనేది ఆసక్తిగా మారింది. కథ విషయంలో తేడాలొచ్చాయా..? లేక బడ్జెట్ విషయంలోనా..? అని చర్చించుకుంటున్నారు. ఈ మూవీ నుంచి రవితేజ తప్పుకోవడంతో దర్శకుడు నక్కిన త్రినాధరావు మెగా హీరో వరుణ్ తేజ్ తో ఈ సినిమా చేయాలనుకుంటున్నారని ప్రచారం జరుగుతుంది. వరుణ్‌ తేజ్ ప్రస్తుతం ఎఫ్‌ 3, గని సినిమాల్లో నటిస్తున్నారు. మరి.. వరుణ్‌ తేజ్ – నక్కిన త్రినాధరావు ప్రాజెక్ట్ పై త్వరలో క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్