Friday, March 6, 2026
HomeTrending Newsపగటి పూట కూడా ఆంక్షలు

పగటి పూట కూడా ఆంక్షలు

రాష్ట్రవ్యాప్తంగా ఎల్లుండి (బుధవారం) నుంచి పగటి పూట కూడా పాక్షిక కర్ఫ్యూ అమల్లో వుంటుంది. కోవిడ్‌పై సమీక్ష సందర్భంగా ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు షాపులు తెరిచేందుకు అనుమతించాలని, ఆ తర్వాత అత్యవసర సేవలు మాత్రమే అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే రాష్ట్రంలో రాత్రి 9 గంటల నుంచి మర్నాడు ఉదయం 5 గంటల వరకూ నైట్ కర్ఫ్యూ అమల్లో వుంది. కోవిడ్ తీవ్రత దృష్ట్యా పగలు కూడా ఆంక్షలు విధించారు.

ఈ తాజా ఆంక్షలు రెండు వారాల పాటు ఆంక్షలు అమల్లో వుంటాయి. షాపులు తెరిచి ఉంచే సమయంలోనూ 144వ సెక్షన్‌ అమల్లో వుంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular