రాష్ట్రంలో లాక్ డౌన్ విధించే ఆలోచన లేదని తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలని, ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరిస్తూ అత్యవసరమైతే తప్ప ప్రజలు బైటికి రావొద్దని సూచించారు
కరోనా రెండో దశను అంచనా వేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫమైందని, రాష్ట్రాలను అప్రమత్తం చేయలేదని ఆరోపించారు. ఆక్సిజన్ సరఫరాలో జాప్యం, వాక్సిన్ కొరత కేంద్ర ప్రభుత్వ నిర్వాకమేనని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్ర పెద్దలు చేస్తున్న విమర్శలు అర్ధరహితమన్నారు. వాక్సిన్లు, ఆక్సిజన్ రెండూ కేంద్రం చేతుల్లోనే పెట్టుకున్నారని విమర్శించారు.
కోవిద్ టెస్టులు, వాక్సిన్ ఒకేచోట నిర్వహించడం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయని, దీనిపై ప్రత్యామ్నాయం ఆలోచిస్తున్నామని చెప్పారు.