Friday, March 29, 2024
Homeసినిమా ‘రౌడీ అల్లుడు’కి మరో వెర్షన్  ధమాకా: ప్రసన్న కుమార్ బెజవాడ

 ‘రౌడీ అల్లుడు’కి మరో వెర్షన్  ధమాకా: ప్రసన్న కుమార్ బెజవాడ

మాస్ మహారాజా రవితేజ, కమర్షియల్ మేకర్ త్రినాథరావు నక్కిన కాంబోలో రూపొందిన మాస్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ధమాకా’. రవితేజ సరసన టాలీవుడ్ ఫేవరేట్ హీరోయిన్ శ్రీలీల హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రాన్ని టిజి విశ్వ ప్రసాద్ భారీగా నిర్మిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ & అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాల పై రూపొందుతున్న ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. ఇప్పటికే విడుదలైన ధమాకా పాటలు, టీజర్ అద్భుతమైన రెస్పాన్స్ తో సినిమా పై భారీ అంచనాలు పెంచాయి. డిసెంబర్ 23న ‘ధమాకా’ ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లో విడుదలవుతోంది.

ఈ సందర్భంగా చిత్ర రచయిత ప్రసన్న కుమార్ బెజవాడ మాట్లాడుతూ… వివేక్ గారు నేను కలసి ఒక సినిమా చేయాలని అనుకున్నాం. మొదట వాళ్లకి సైన్ చేశాను. అదే సమయంలో రవితేజ గారు నా వర్క్ నచ్చి అభినందించాలని పిలిచారు. తర్వాత చాలా రోజులు సరదాగా మాట్లాడుకున్నాం. నేను ఏదీ ఆశించలేదు. కొన్ని రోజుల జర్నీ తర్వాత ..’ఏదైనా వుంటే చెప్పు.. మనం చేద్దాం’ అని రవితేజ గారు అన్నారు. దీంతో వర్క్ చేయడం స్టార్ట్ చేశాం. మొదట ఒక ప్రాజెక్ట్ అనుకున్నాం. అయితే.. వేరే కారణాలు వలన అది కురలేదు. తర్వాత ధమాకా కథ చెప్పాను. ఫస్ట్ సిట్టింగ్ లోనే రవితేజ గారికి నచ్చేసింది. వెంటనే చేసేద్దామని చెప్పారు. లాక్ డౌన్ కి ముందు ఈ కథ చెప్పాను. లాక్ డౌన్ లో స్క్రిప్ట్ వర్క్ అంతా కంప్లీట్ చేశాం.

Dandakadiyal Song

రవితేజ గారిని దృష్టిలో పెట్టుకొని ఆయన కోసమే రాసుకున్న కథ ఇది. ఆయన నుండి వరుసగా సీరియస్ సినిమాలు వస్తున్నాయి. రవితేజ గారి బలం ఎంటర్ టైన్ మెంట్. మా బలం కూడా అదే. ఇద్దరం కలసి మంచి ఎంటర్ టైనర్ చేయాలని ధమాకా చేశాం. ఒక రిచ్ క్యారెక్టర్, ఒక పూర్ క్యారెక్టర్ వుంటుంది. ఒక ఇన్సిడెంట్ రెండు డిఫరెంట్ క్యారెక్టర్లు ఎలా చూస్తారనేదాని పై భేస్ అయిన సినిమా. ఇంకా చెప్పాలంటే… రౌడీ అల్లుడికి మరో వెర్షన్ లా ఉంటుంది అని చెప్పచ్చు. నేను ఒక సీన్ చెబితే దాని అవుట్ పుట్ ఎలా వుంటుందో మా డైరెక్టర్ గారికి తెలిసిపోతుంది. ఒక సీన్ చెప్పినప్పుడు అందులో డైలాగ్ రాసిన తర్వాత బావుంటుందని చెబితే.. నా పై నమ్మకంతో వదిలేస్తారు. బయట ఈ కంఫర్ట్ ఉండకపోవచ్చు. మా ఇద్దరికి మంచి సింక్ కుదిరింది.

Du Du Song

ఈ కథ కోసం నేను పెద్ద కష్టపడలేదు. నా లోపలే ఒక చిన్న రవితేజ ఉన్నాడని నా ఫీలింగ్. నా గత సినిమాలు చూసినా అందులో హీరో పాత్రలలో రవితేజ గారి ప్రభావం వుంటుంది. తెలియకుండానే ఆయన ఇంపాక్ట్ నాలో వుంది. అందుకే పెద్దగా కష్టపడ్డానని అనుకోను. ఇందులో రావు రమేష్ గారు హైపర్ ఆది కాంబినేషన్ అవుట్ స్టాండింగ్ గా వుంటుంది. వాళ్ళు కనిపిస్తే చాలు నవ్వుతారు. కొంతమందికి సినిమా చూపించాం. చూసిన వారంతా అవుట్ స్టాండింగ్ అంటున్నారు. అలీ గారి పాత్ర కూడా బావుటుంది. మచ్చ రవి గారు, సత్యం రాజేష్ గారి ఎపిసోడ్లు కూడా బావుంటాయి. హీరో హీరోయిన్ మధ్య సీక్వెన్స్ లు, ఆఫీస్ సీన్స్ హిలేరియస్ గా వుంటాయి. ఇంటర్వెల్ కి ముందు వచ్చే ఐదు నిమిషాల ఎపిసోడ్ సినిమా రేంజ్ ని డిసైడ్ చేసే ఎంటర్ టైన్ మెంట్ సీక్వెన్స్. ఈ సినిమాను హిందీలో కూడా విడుదల చేస్తున్నాం. ఇక నెక్ట్స్ మూవీస్ విషయానికి వస్తే.. నాగార్జున గారి కోసం ఒక స్క్రిప్ట్ చేస్తున్నాను. ఇది రీమేక్ అని వార్తలు వచ్చాయి. అది అవాస్తవం. నా సొంత కథే. విశ్వక్ సేన్ చేస్తున్న దాస్ కా ధమ్కి షూటింగ్ పూర్తి చేసుకుంది. మరో చిన్న సినిమా కూడా చేస్తున్నాను అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్