Saturday, March 7, 2026
HomeTrending Newsలోక్ సభ స్పీకర్ కు రేవంత్ లేఖ

లోక్ సభ స్పీకర్ కు రేవంత్ లేఖ

రాష్ట్రంలోని వివిధ అంశాలపై లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు మల్కాజ్ గిరి ఎం.పీ, టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి లేఖ రాశారు.

నేను తెలంగాణ లోని మల్కాజ్‌గిరి పార్లమెంట్ నియోజకవర్గం నుండి లోకసభ కు ప్రాతినిధ్యం వహిస్తున్నాను, భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ  తెలంగాణ శాఖ (టీపీసీసీ) అధ్యక్షుడిగా పని చేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పార్లమెంట్ లో మా గొంతు వినిపించేందుకు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాం.  తెలంగాణ లోని ప్రభుత్వ భూమిని వారి బంధువులకు మరియు టిఆర్ఎస్ అధికార పార్టీ కార్యకర్తలకు అతి తక్కువ ధరలకు విక్రయించడాన్ని వ్యతిరేకిస్తూ పార్లమెంటులో సమస్యను లేవనెత్తాలని మేము నిర్ణయించుకున్నాము.

ఈ రోజు నుండి ప్రారంభమైన పార్లమెంటు సమావేశానికి హాజరుకావాలని, ఈ విషయమై సంబంధిత అధికారులకు పదేపదే అభ్యర్థన చేసినప్పటికీ,  ఢిల్లీకి వెళ్లాలని తెలిపినప్పటికీ తెలంగాణ రాష్ట్ర పోలీసులు పార్లమెంట్ కు నేను వెళ్లాడాన్ని అడ్డుకున్నారు.

పార్లమెంట్ నడుస్తున్న సమయంలో పార్లమెంట్ హక్కులను కాలరాసి పార్లమెంటుకు హాజరుకాకుండా చేశారు, రాజకీయ కారణాలతో పార్లమెంటు సభ్యుడిని అరెస్టు చేయడానికి గౌరవ స్పీకర్ అనుమతి ఖచ్చితంగా అవసరం. అందువల్ల మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. పార్లమెంట్ కు ఉన్న ప్రత్యేక హక్కులను ఉపయోగించి నన్ను పార్లమెంట్ లో  పాల్గొని ప్రజా సమస్యలపై మాట్లాడే అవకాశాలు కల్పించాలని కోరుకుంటున్నాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular