Thursday, April 25, 2024
Homeసినిమా‘ల‌క్ష్య’ ఇండిపెండెన్స్ డే స్పెషల్ పోస్టర్ విడుదల

‘ల‌క్ష్య’ ఇండిపెండెన్స్ డే స్పెషల్ పోస్టర్ విడుదల

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నాగశౌర్య హీరోగా ప్రాచీన విలువిద్య నేప‌థ్యంలో రూపొందుతోన్న నాగ‌శౌర్య 20వ చిత్రం ‘ల‌క్ష్య’. ఎంట‌ర్‌టైనింగ్‌, థ్రిల్లింగ్‌, ఎగ్జ‌యిట్‌మెంట్ అంశాల‌తో రూపొందుతోన్న ఈ చిత్రం.. నాగ‌శౌర్య 20వ సినిమా. ఇప్ప‌టి వ‌ర‌కు క‌నిపించ‌ని స‌రికొత్త లుక్‌లో నాగ‌శౌర్య క‌నిపించ‌బోతున్నారు. 75వ స్వాతంత్య్ర దినోత్స‌వం సంద‌ర్బంగా ‘ల‌క్ష్య’ మేక‌ర్స్ ఈ సినిమా నుంచి స‌రికొత్త పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. నాగ‌శౌర్య ఇందులో పార్థు అనే అర్చ‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు. అది కూడా ఇండియా త‌రపున ఆర్చ‌రీలో పాల్గొనే ఆట‌గాడిగా శౌర్య క‌నిపించ‌బోతున్న‌ట్లు పోస్ట‌ర్‌ను చూస్తే అర్థ‌మ‌వుతుంది. ఇండిపెండెంట్స్ డే రోజున ఇది ప‌ర్‌ఫెక్ట్ పోస్ట‌ర్‌.

ధీరేంద్ర సంతోష్‌ జాగర్లపూడి దర్శకత్వంలో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రం షూటింగ్ తుది ద‌శ‌కు చేరుకుంది. మ‌రోవైపు పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు కూడా శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. సోనాలి నారంగ్ స‌మ‌ర్పణ‌లో శ్రీ వేంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌ఎల్‌పి, నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్లపై  నారయణదాస్ కె. నారంగ్‌, పుస్కూర్‌ రామ్‌మోహన్‌రావు, శరత్‌ మరార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నాగ‌‌శౌర్య స‌ర‌స‌న కేతిక శ‌ర్మ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ చిత్రంలో కీల‌క పాత్రల‌లో విలక్షణ న‌టుడు జ‌గ‌ప‌తి బాబు న‌టిస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్