104 కాల్ సెంటర్ పూర్తి స్థాయిలో సమర్థంగా పని చేసేలా జిల్లా కలెక్టర్లు శ్రద్ధ తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు. నేడు మంగళవారం స్పందన కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్లతో 104 సేవలపై పలు సూచనలు చేశారు. 104 నెంబర్‌కు ఫోన్ చేసిన వారికి తక్షణమే పరిష్కారం చూపాలని, ఆస్పత్రికి వెళ్లడమా, క్వారంటైన్‌కు పంపడమా, హోం ఐసొలేషనా? అనేది స్పష్టంగా వివరించాలని సూచించారు.
104 నెంబర్‌ను మనసా, వాచా, కర్మణా ఓన్ చేసుకోవాలని, కోవిడ్‌కు సంబంధించిన అన్ని సమస్యలకు 104 నెంబర్ అన్నది వన్ స్టాప్ సొల్యూషన్ గా వుండాలని నిర్దేశించారు. 104 కాల్ సెంటర్‌కు సంబంధించి తగిన సంఖ్యలో వైద్యులు అందుబాటులో ఉండాలని, జాయింట్ కలెక్టర్లు గ్రామ వార్డు సచివాలయాలు. అభివృద్ధి) ఇక నుంచి కోవిడ్‌పైనే దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి చెప్పారు.
జిల్లా స్థాయిలో కోవిడ్ ఆస్పత్రులను క్లస్టర్లుగా విభజించి, వాటికి ఇంఛార్జ్‌లను నియమించాలన్నారు. అన్ని ఆస్పత్రులలో వైద్య సిబ్బంది, పారా మెడికల్ సిబ్బంది పూర్తి స్థాయిలో ఉండాలని… ఎక్కడ ఖాళీలున్నా వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహించి 48 గంటల్లో నియామకాలు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సూచించారు.