రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షలు ముదుంగా నిర్ణయించిన ప్రకారం జూన్ 7వ తేదీ నుంచి నిర్వహిస్తామని, దీనికి అనుగుణంగా విద్యార్థులు సిద్ధం కావాలని ఆంధ్ర ప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు. కోవిడ్ -19 రెండవ దశ ఉద్ధృతంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో… పదవ తరగతి వారికి సిలబస్ మొత్తం పూర్తయిన నేపథ్యంలో… మే 1 నుంచి 31 వరకు వేసవి సెలవులను ప్రభుత్వం ప్రకటించడం జరిగిందని వెల్లడించారు.
ఏప్రిల్ 30వ తేదీ రాష్ట్రంలోని జూనియర్ కళాశాలలు, టెన్త్ క్లాస్ విద్యార్థులకు లాస్ట్ వర్కింగ్ డే అవుతుందన్నారు. సెలవుల్లో ఇంటి పట్టునే ఉండి విద్యార్థులందరూ పరీక్షలకు బాగా ప్రిపేర్ కావాలని మంత్రి సూచించారు.