Thursday, January 23, 2025
Homeజాతీయంస్టాలిన్ ‘ఉచితాలు’ మొదలు!

స్టాలిన్ ‘ఉచితాలు’ మొదలు!

త‌మిళ‌నాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మొదటిరోజే హామీల అమలుపై దృష్టి సారించారు స్టాలిన్. ప్రభుత్వ బ‌స్సుల్లో మ‌హిళ‌ల‌కు ఉచిత ప్ర‌యాణం ఫైలుపై మొదటి సంతకం చేశారు. రేష‌న్ కార్డు ఉన్న దాదాపు రెండు కోట్ల కుటుంబాల‌కు క‌రోనా ఆర్థిక సాయం కింద రూ.4 వేలు చొప్పున అందించనున్నారు.

ఇందులో భాగంగా తొలి విడ‌త కింద త్వ‌ర‌లో రూ.2 వేల చొప్పున జ‌మ చేస్తామ‌ని తెలిపారు. అంతేకాదు, త‌మిళ‌నాడు వ్యాప్తంగా లీట‌రు పాల‌పై రూ.3 త‌గ్గిస్తూ త‌మిళ‌నాడు కొత్త‌ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. అలాగే మ‌రిన్ని ప్ర‌యోజ‌నాల‌ను త్వ‌ర‌లోనే ప్ర‌జ‌ల‌కు అందించ‌నున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్