Tuesday, June 16, 2026
HomeసినిమాCustody: నాగచైతన్య మాస్ ప్రయత్నం ఫలిస్తుందా..?

Custody: నాగచైతన్య మాస్ ప్రయత్నం ఫలిస్తుందా..?

నాగచైతన్య.. ‘జోష్’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. తొలి ప్రయత్నంలోనే నటుడుగా మెప్పించాడు కానీ.. కమర్షియల్ సక్సెస్ సాధించలేదు. ఆతర్వాత ‘ఏమాయ చేశావే’ సినిమాతో బ్లాక్ బస్టర్ సాధించాడు. ‘100% లవ్’, ‘ఒక లైలా కోసం’, ‘మనం’, ‘మజిలీ’, ‘వెంకీ మామ’, ‘లవ్ స్టోరీ’.. ఇలా ప్రేమకథా చిత్రాలు, కుటుంబ కథా చిత్రాలతో ఆకట్టుకున్నాడు. అయితే.. ‘దడ’, ‘బెజవాడ’, ‘సవ్యసాచి’, ‘యుద్ధం శరణం’.. ఇలా మాస్ చిత్రాలతో మాత్రం మెప్పించలేకపోయాడు. చైతన్యకు మాస్ సినిమాలంటే.. ఇష్టం. అందుచేత మాస్ మూవీతో మెప్పంచాలని ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు.

తాజాగా కోలీవుడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభుతో చైతన్య ‘కస్టడీ‘ అనే సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ్ లో చేస్తున్నారు. మే 12న చిత్రం విడుదల కానుంది. ఇటీవల కస్టడీ టీజర్ రిలీజ్ చేశారు. చైతూ పూర్తి మాస్ మూవీ చేస్తే ప్రేక్షకులు యాక్సెప్ట్ చేయరు. కొంచెం క్లాస్ టచ్.. వైవిధ్యం ఉండి.. మాస్‌ను జోడిస్తే కొంచెం వర్కవుట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కస్టడీ ఆ తరహా సినిమాలాగే కనిపిస్తోంది. వెంకట్ ప్రభు ఆషామాషీ దర్శకుడు కాదు కాబట్టి అక్కినేని ఫ్యాన్స్ అతడి మీద నమ్మకం పెట్టుకోవచ్చు. తమిళంలో అతను స్టార్లతో సినిమాలు తీశాడు.

తన మార్కు వైవిధ్యాన్ని అందిస్తూనే.. మాస్ మెచ్చేలా సినిమాలు తీశాడు. కాబట్టి చైతూకు అతను తొలి మాస్ హిట్ ఇస్తాడని ఆశించవచ్చు. ఇందులో సీనియర్ హీరోయిన్ ప్రియమణి కీలక పాత్ర పోషిస్తుంటే.. సీనియర్ యాక్టర్ అరవింద్ స్వామి విలన్ గా నటిస్తున్నారు. తండ్రీకొడుకులు ఇళయరాజా, యువన్ శంకర్ రాజా కలిసి సంగీతం అందిస్తుండడం విశేషం. మొత్తానికి భారీ తారాగణంతో కస్టడీ రూపొందుతోంది. ఈ సినిమాతో ఖచ్చితంగా చైతన్య మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటాడు అనే టాక్ వచ్చింది. మరి.. చైతూ మాస్ ప్రయత్నం ఫలిస్తుందో.. లేదో..?

Also Read :  చైతూ దృష్టి అంతా ఇప్పుడు ‘కస్టడీ’పైనే! 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular