Wednesday, June 17, 2026
Homeసినిమాపూరి జగన్నాథ్ నెక్ట్స్ ఏంటి..?

పూరి జగన్నాథ్ నెక్ట్స్ ఏంటి..?

చిరంజీవి, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో ‘ఆటో జానీ’ అనే సినిమా వస్తుంది అనుకున్నారు. అయితే.. సెకండాఫ్ నచ్చకపోవడంతో ఆగిపోయింది. అయితే.. చిరంజీవితో ఎప్పటికైనా సినిమా చేస్తానని పూరి చెప్పారు. ఈమధ్య స్వయంగా చిరంజీవే మంచి కథతో చెప్పు మనం సినిమా చేద్దామని పూరికి ఆపర్ ఇచ్చారు. దీంతో ఖచ్చితంగా మంచి కథతో వస్తాను అని పూరి చెప్పడం జరిగింది. ఇక ఈ ప్రాజెక్ట్ కన్ ఫర్మ్. త్వరలో అనౌన్స్ మెంట్ ఉంటుంది అనుకున్నారు. అయితే.. రోజులు గడుస్తున్నాయి కానీ.. ఈ ప్రాజెక్ట్ గురించి మాత్రం ఎలాంటి అప్ డేట్ రావడం లేదు. దీంతో పూరి నెక్ట్స్ ఏంటి..? అనేది ఆసక్తిగా మారింది.

అయితే ఇటీవల చిరంజీవికి పూరి కథ చెప్పారని. ఆ కథ నచ్చలేదని.అందుకని ప్రాజెక్ట్ లేదనే టాక్ వినిపించింది. చిరంజీవితో ప్రాజెక్ట్ సెట్ కాకపోవడంతో రామ్ తో ‘ఇస్మార్ట్ శంకర్ 2’ చేయాలని ఫిక్స్ అయ్యారట. రామ్ కూడా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని వార్తలు వచ్చాయి. అయితే.. పూరి ఎక్కడ ఉన్నారో..? ఏం చేస్తున్నారో..? ఎలాంటి అప్ డేట్ లేదు. ఎప్పుడూ యాక్టీవ్ గా ఉండే.. పూరి ఇలా సైలెంట్ అయిపోవడం అర్థం కావడం లేదు. ఒకప్పుడు ట్విట్టర్ లో యాక్టీవ్ గా ఉండే పూరి.. ఏకంగా అకౌంట్ నే క్లోజ్ చేశారు.

చిరంజీవి నో చెప్పడంతో.. ఓ వైపు రామ్ తో సినిమా చేయడం కోసం.. మరో వైపు బాలయ్యతో సినిమా చేయడం కోసం ట్రై చేస్తున్నారని తెలిసింది. బాలయ్య ప్రస్తుతం అనిల్ రావిపూడితో సినిమా చేస్తున్నారు. రామ్.. బోయపాటి శ్రీనుతో సినిమ చేస్తున్నారు. ఇటీవల పూరి, ఛార్మి కలిసున్న ఫోటో బయటకు వచ్చింది. ముంబాయి నుంచి హైదరాబాద్ వచ్చారని.. రామ్ కు కథ చెప్పారని తెలిసింది. ఆతర్వాత ఎలాంటి అప్ డేట్ లేదు. మరి.. పూరితో సినిమా చేయడానికి రామ్ ఓకే చెబుతాడో..? బాలయ్య ఓకే చెబుతాడో..? చూడాలి.

Also Read : పూరి నెక్ట్స్ మూవీ చిరుతో కాదా?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular