Wednesday, June 17, 2026
Homeసినిమాపూరి నెక్ట్స్ మూవీ చిరుతో కాదా?

పూరి నెక్ట్స్ మూవీ చిరుతో కాదా?

డైరెక్టర్ పూరి జగన్నాథ్ ‘లైగర్’ తర్వాత ఎవరితో సినిమా చేస్తారనేది ఇంకా ప్రకటించలేదు. విజయ్ తో మొదలు పెట్టిన ‘జనగణమన’ ఆగిపోయింది. దీంతో పూరి నెక్ట్స్ మూవీ ఎవరితో అనేది ఆసక్తిగా మారింది. అయితే.. ఇటీవల గాడ్ ఫాదర్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా చిరంజీవిని పూరి జగన్నాథ్ ఇంటర్ వ్యూ చేశారు. ఈ ఇంటర్ వ్యూలో మనం సినిమా చేద్దాం మంచి కథ ఉంటే చెప్పమని చిరంజీవి పూరిని అడగడం.. కథ రెడీ చేస్తున్నానని పూరి చెప్పడంతో ఈసారి ఈ క్రేజీ కాంబో ఫిక్స్ అని టాక్ బలంగా వినిపించింది.

చిరంజీవి కూడా ‘భోళా శంకర్’ సినిమా తర్వాత మరో సినిమా ఎవరితోనూ కమిట్ కాలేదు. దీంతో పూరితో మెగా మూవీ ఉండొచ్చని అంతా భావించారు. అయితే  దీనిపై ఓ వార్త బయటకు వచ్చింది. ఏంటంటే.. పూరి నెక్ట్స్ మూవీని చిరుతో చేయడం లేదట. తనయుడు ఆకాష్ తో చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది. ఆకాష్‌ పూరి కోసం పూరి జగన్నాధ్ మంచి ఎంటర్ టైన్మెంట్ ఉన్న కథను రాశాడట. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి ఈ కాంబినేషన్ సెట్ అయ్యేలా ఉంది.

ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఇదొక ఎమోషనల్ యాక్షన్ స్టోరీ అని తెలుస్తోంది. తండ్రి కొడుకుల మధ్య సాగే ఈ కథలో ఇండియట్ కి కొనసాగింపుగా ఉంటుందని టాక్. అయితే.. తండ్రి పాత్ర పాయింట్ ఆఫ్ వ్యూలో కథ సాగుతుందట. ఈ సినిమాలో ఎమోషన్ ఉన్నా.. మెయిన్ గా కామెడీ బేస్డ్ గానే సినిమా ఉంటుందని సమాచారం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. త్వరలో అనౌన్స్ మెంట్ ఉంటుందని తెలిసింది. మరి.. ఈసారైనా ఆకాష్ తో పూరి చేసే సినిమా సక్సెస్ అవుతుందేమో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular