Thursday, May 30, 2024
Homeసినిమావిష్వక్ ఆ మాట అనగానే చాలా బాధనిపించింది: ఎన్టీఆర్

విష్వక్ ఆ మాట అనగానే చాలా బాధనిపించింది: ఎన్టీఆర్

Jr Ntr Speech: విష్వక్సేన్ హీరోగా ‘దాస్ కా ధమ్కీ‘ సినిమా థియేటర్లకు రావడానికి రెడీ అవుతోంది. ఈ సినిమాకి ఆయనే దర్శక నిర్మాత. ‘ఉగాది’ పండుగ సందర్భంగా ఈ సినిమాను ఈ నెల 22వ తేదీన విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటును నిన్న హైదరాబాదులో నిర్వహించారు. ఎన్టీఆర్ చీఫ్ గెస్టుగా హాజరయ్యాడు. అమెరికా నుంచి రాగానే రెస్టు తీసుకోకుండా ఆయన ఈ ఫంక్షన్ కి రావడం విశేషమే.

ఈ స్టేజ్ పై ఎన్టీఆర్ మాట్లాడుతూ .. “విష్వక్ సినిమాలను మొదటి నుంచి చూస్తూ వస్తున్నాను. హీరోగా చేసినా .. దర్శకత్వం చేసినా ఆయనలో నాకు కనిపించింది కాన్ఫిడెన్స్. ఆ కాన్ఫిడెన్స్ వల్లనే ఆయన ఈ రోజున ఇంతవరకూ వచ్చాడని నేను అనుకుంటున్నాను. తన ఇమేజ్ కి భిన్నమైన పాత్రలను ఎంచుకుని .. అందుకు తగినట్టుగా బాడీ లాంగ్వేజ్ ను మార్చుకుని చేయడం నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది.

మా ఇంటికి వచ్చి నన్ను పిలిచినప్పుడు .. ఈ సినిమా కోసం ఉన్నదంతా పెట్టేశాను అని చెప్పాడు. ఆ మాట వినగానే నాకు చాలా బాధగా అనిపించింది. ఆయనకి సినిమా అంటే ఎంత పిచ్చి అనేది అప్పుడు నేను చూశాను. అలాంటి పిచ్చి ఉన్నవాళ్ల సినిమాలను ఆదరించాలి .. అప్పుడే మరికొన్ని సినిమాలు వస్తాయి. ఇక ఈ సినిమాతో తాను ఇక డైరెక్షన్ ఆపేసి, కొత్తవాళ్లకి ఛాన్సులు ఇవ్వాలని కోరుకుంటున్నాను” అని చెప్పుకొచ్చారు.

Also Read : 22న ‘దాస్ కా ధమ్కీ’ విడుదల

RELATED ARTICLES

Most Popular

న్యూస్