Thursday, March 19, 2026
Homeసినిమా29న అల్లు శిరీష్ 'ఉర్వశివో... రాక్షసివో' టీజర్

29న అల్లు శిరీష్ ‘ఉర్వశివో… రాక్షసివో’ టీజర్

భలే భలే మగాడివోయ్, గీత గోవిందం, టాక్సీవాలా, ప్రతిరోజు పండగే, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలను నిర్మించిన GA2 పిక్చర్స్ లో రాబోతున్న తదుపరి చిత్రం “ఉర్వశివో రాక్షసివో”…. ‘కొత్తజంట’, ‘శ్రీరస్తు శుభమస్తు’, ‘ఒక్క క్షణం’, ‘ఎబిసిడి’ లాంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న అల్లు శిరీష్ హీరోగా ‘విజేత’ ఫేమ్ రాకేష్ శశి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది.  శిరీష్ సరసన అను ఇమ్మాన్యూల్ హీరోయిన్ గా నటించింది.

‘ప్రేమకాదంట’ అని మొదట అనౌన్స్ చేసిన ఈ చిత్ర టైటిల్ ను ప్రస్తుతం “ఉర్వశివో రాక్షసివో” అని మార్చి అధికారికంగా ప్రకటించారు చిత్రబృందం. చిత్ర టైటిల్ తో రిలీజ్ చేసిన పోస్టర్ యూత్ ను ఆకర్షించేలా ఉంది. శిరీష్ , అనుఇమ్మాన్యూల్ కెమిస్ట్రీ పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయిన ఫీల్ ను క్రియేట్ చేస్తుంది. పోస్టర్ చూస్తుంటే ఈ సినిమా యూత్‌పుల్ ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్ అని అర్ధమవుతుంది. ఈ సినిమా టీజర్ ను సెప్టెంబర్ 29న రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది చిత్ర బృందం. అచ్చు రాజమణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

ప్రతిష్ఠాత్మక బ్యానర్ GA2 పిక్చర్స్ పై ధీరజ్ మొగిలినేని ఈ చిత్రాన్ని నిర్మించారు. విజయ్ ఎం సహానిర్మతగా వ్యవహారించారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో వుంది. ఈ సినిమాను నవంబర్4న విడుదల చేయనున్నారు. ఇందులో భాగంగా ఈ చిత్ర ప్రోమోషన్స్ మొదలుపెట్టనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular