Sunday, June 14, 2026
HomeTrending Newsకళ్యాణమస్తుతో బాల్య వివాహాల నివారణ: సిఎం

కళ్యాణమస్తుతో బాల్య వివాహాల నివారణ: సిఎం

స్కూళ్లలో ఏర్పాటుచేసిన టీఎంఎఫ్, ఎస్‌ఎంఎఫ్‌ తరహాలో అంగన్‌వాడీల నిర్వహణ, పరిశుభ్రతకోసం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలని  రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు. టాయిలెట్ల మరమ్మతు పనులు చేపట్టాలన్నారు. అంగన్‌వాడీ పిల్లలకు భాష, ఉచ్ఛారణలపై ఇప్పటినుంచే ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. బాల్య వివాహాలను పూర్తిగా నివారించాలని,  ఈ విషయంలో కళ్యాణమస్తు పథకం ప్రత్యేక పాత్ర పోషిస్తుందని,  అందులే ఈ పథకానికి అర్హత పొందిన వధువు, ఆమెను వివాహం చేసుకునే వరుడు తప్పనిసరిగా టెన్త్‌ ఉత్తీర్ణత సాధించాలన్న నిబంధన విధించామని స్పష్టం చేశారు. మహిళా, శిశు సంక్షేమశాఖపై సిఎం జగన్ సమీక్ష నిర్వహించారు. అంగన్‌వాడీల నిర్వహణ, పిల్లలకు నాణ్యమైన పౌష్టికాహారం, దివ్యాంగుల సంక్షేమం తదితర అంశాలపై ఆరా తీశారు.

ఈ సందర్భంగా సిఎం పలు సూచనలు చేశారు.

⦿ పాఠశాల విద్యాశాఖతో కలిసి పకడ్బందీగా పీపీ–1, పీపీ–2 పిల్లలకు పాఠ్యప్రణాళిక అమలు చేయాలి
⦿ అన్నీకూడా బైలింగువల్‌ టెక్ట్స్‌బుక్స్‌ ఉండాలి
⦿ అంగన్‌వాడీలకు అత్యంత నాణ్యమైన పౌష్టికాహారం పంపిణీపై పర్యవేక్షణ ఉండాలి
⦿ ప్రస్తుతం జరుగుతున్న కొనుగోలు, పంపిణీ విధానాలను సమగ్రంగా సమీక్షించిన సీఎం.
⦿ పిల్లలకు అందించే ఆహారం నాణ్యంగా ఉండాలన్నదే ప్రధాన ఉద్దేశం
⦿ అక్కడక్కడా లోపాలు తలెత్తుతున్న సమాచారం నేపథ్యంలో పగడ్బందీ విధానాలు అమలు చేయాలి
⦿ నాణ్యతను పూర్తిస్థాయిలో చెక్‌చేసిన తర్వాతనే పిల్లలకు చేరాలి
⦿ మార్క్‌ఫెడ్‌ ఆధ్వర్యంలో కొనుగోళ్లు, పంపిణీని పైలట్‌ప్రాజెక్ట్‌ కింద చేపట్టాలి
⦿ పేరొందిన సంస్థతో థర్డ్‌ఫార్టీ తనిఖీలు జరిగేలా చూడాలి
⦿ అన్ని అంగన్‌వాడీలకు, స్కూళ్లలో మధ్యాహ్న భోజనానికి సార్టెక్స్‌ చేసిన బియ్యాన్నే పంపిణీచేయాలి
⦿ ఎస్‌డీజీ లక్ష్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టి కార్యక్రమాల అమలుపై పటిష్టంగా పర్యవేక్షణ చేయాలి
⦿ దివ్యాంగులకోసం ప్రతి నియోజకవర్గంలో ఒక భవిత సెంటర్‌ను అప్‌గ్రేడ్‌ చేయాలి
⦿ దివ్యాంగులకు అవసరమైన సేవలను గ్రామ, వార్డు సచివాలయాల్లోనే అందించేలా తగిన చర్యలు తీసుకోవాలి
⦿ జువైనల్‌ హోమ్స్‌ పర్యవేక్షణకు ప్రత్యేక ఐఏఎస్‌ అధికారిని నియమించాలి
⦿ జువైనల్‌ హోమ్స్‌లో సౌకర్యాల కల్పనపైనా ప్రత్యేక దృష్టిపెట్టాలి

అధికారుల వివరణ:
⦿ సెప్టెంబరు 30 కల్లా అంగన్‌వాడీ సూపర్‌ వైజర్ల పోస్టుల భర్తీ చేస్తామని వెల్లడి
⦿ సీఎం ఆదేశాలమేరకు అత్యంత పారదర్శకంగా పరీక్షల ప్రక్రియ నిర్వహిస్తున్నాన్నాం
⦿ ఇంటర్వ్యూలు ముగిశాక మార్కుల జాబితాలను వెల్లడిస్తాం
⦿ పరీక్షలకు హాజరైన అభ్యర్థులు అవసరమనుకుంటే.. తమ ఆన్సర్‌షీట్లను కూడా పరిశీలించుకునే అవకాశం
⦿ పరీక్షల ప్రక్రియను పూర్తిచేసి సెప్టెంబరు 30 కల్లా సూపర్‌వైజర్లను నియమించేలా చర్యలు తీసుకుంటాం

టెంపరరీ సర్టిఫికేట్ దారులకూ పెన్షన్లు:
⦿ మానసిక వైకల్యంపై వైద్యులు టెంపరరీ సర్టిఫికెట్లు జారీచేసినా, వారికి పెన్షన్లు మంజూరుచేయాలి
⦿ సీఎం ఆదేశాల మేరకు ఉత్తర్వులు జారీచేయనున్న అధికారులు
⦿ ప్రభుత్వ పథకాలకు కొత్తగా అర్హత సాధించిన వారికి ప్రతి ఏటా జులై, డిసెంబర్లలో మంజూరు ప్రక్రియ
⦿ దీంట్లో భాగంగా మానసిక వైకల్యంపై టెంపరరీ సర్టిఫికెట్లు ఉన్నవారికి ఈ డిసెంబర్లో పెన్షన్లు మంజూరు.

ఈ సమీక్షా సమావేశంలో మహిళా, శిశుసంక్షేమ శాఖ మంత్రి కేవీ. ఉషాశ్రీచరణ్, స్పెషల్‌ సీఎస్‌ బుడితి రాజశేఖర్, మహిళా, శిశుసంక్షేమ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఏఆర్‌.అనురాధ, మార్క్‌ఫెడ్‌ కమిషనర్‌ పీఎస్‌. ప్రద్యుమ్న, మహిళా, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్‌ ఎ.సిరి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Also Read : జనవరి నుంచి పెన్షన్ కానుక పెంపు : సిఎం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular