Sunday, November 24, 2024
Homeస్పోర్ట్స్FIFA: ఫుట్ బాల్ విజేత అర్జెంటీనా

FIFA: ఫుట్ బాల్ విజేత అర్జెంటీనా

అర్జెంటీనా FIFA వరల్డ్ కప్‌-2022  విజేతగా నిలిచింది. ఫ్రాన్స్‌తో జరిగిన ఫైనల్ పోరులో  నిర్ణీత సమయంలో  రెండు జట్లూ 3-3తో సమంగా నిలిచాయి. పలుమార్లు ఎక్స్‌ట్రా టైం ఇచ్చినా ఇరుజట్లూ మరో గోల్ చేయడంతో విఫలం కావడంతో  పెనాల్టీ షూటౌట్ ఇచ్చారు.

దీనిలో ఇందులో ఫ్రాన్స్ 2 పాయింట్లు చేయగా.. అర్జెంటీనా షూటౌట్‌లో 4 పాయింట్లు సాధించడంతో ఛాంపియన్‌గా నిలిచింది.

ఆట 23వ నిమిషంలో మేస్సీ,  36 వ నిమిషంలో డిమారియో గోల్స్ సాధించారు. దీనితో అర్జెంటీనా విజయం ఖాయం అనుకున్నారు. కానీ 79,80 నిమిషాల్లో 97 సెకన్ల  వ్యవధిలో  ఫ్రాన్స్ ఆటగాడు ఎంబాపె రెండు చక్కని గోల్స్ సాధించి స్కొరు సమం చేసి తమ శిబిరంలో ఆశలు నిలబెట్టాడు.

విజేతను నిర్ణయించడం కోసం అదనపు సమయం ఇచ్చారు. 108 వ నిమిషంలో మేస్సీ గోల్ చేసి మళ్ళీ అర్జెంటీనాను ఆధిక్యంలోకి తీసుకెళ్ళాడు.  ఈ సమయం మరో కొన్ని నిమిషాల్లో ముగుస్తుందనగా ఎంబాపే పేనాల్టీ ద్వారా మరో గోల్ చేసి మళ్ళీ స్కోరుబోర్డు సమంచేశాడు. దీనితో షూటౌట్ కు వెళ్ళాల్సి వచ్చింది.

షూటౌట్ లో ఫ్రాన్స్ కేవలం రెండు ప్రయత్నాల్లోనే సఫలం కాగా అర్జెంటీనా నాలుగు ప్రయత్నాలూ ఒడిసి పట్టుకొని తద్వారా ప్రపంచ విజేతగా అవతరించింది.

1986లో డిగో మారడోనా నేతృత్వంలో కప్ గెల్చిన అర్జెంటీనా 36 ఏళ్ళ తరువాత మరోసారి విజయం దక్కించుకుంది. డిపెండింగ్ ఛాంపియన్ గా కప్ నిలబెట్టుకోవాలన్న ఫ్రాన్స్ ఆశలు నెరవేరలేదు. ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ స్వయంగా మైదానంలోకి వచ్చి ఎంబాపేను ఓదార్చడం విశేషం.

 

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్