Wednesday, March 18, 2026
Homeసినిమాకృష్ణంరాజు కుటుంబానికి బాలకృష్ణ పరామర్శ

కృష్ణంరాజు కుటుంబానికి బాలకృష్ణ పరామర్శ

రెబెల్ స్టార్ కృష్ణంరాజు కుటుంబాన్ని హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ హీరో నందమూరి బాలకృష్ణ సతీసమేతంగా పరామర్శించారు. కృష్ణంరాజుతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. కృష్ణంరాజు చనిపోయిన  సమయంలో టర్కీ షెడ్యూల్ లో షూటింగ్ లో ఉన్నారు బాలకృష్ణ. అందుకే అప్పుడు ఆయన పార్దివ దేహాన్ని చూడడానికి రాలేకపోయారు.

ఎన్నో సంవత్సరాలుగా తమ మధ్య విడదీయరాని బంధం ఉందని.. నాన్నగారి సమయం నుంచి కృష్ణంరాజు గారిని చూస్తూ పెరిగానని, సినిమా ఇండస్ట్రీకి ఆయన ఎంతో సేవ చేశారని కొనియాడారు బాలకృష్ణ. అలాంటి అద్భుతమైన నటుడితో తనకు కూడా కలిసి నటించే అవకాశం వచ్చిందని.. తామిద్దరం సుల్తాన్, వంశోద్ధారకుడు సినిమాలలో కలిసి నటించామని గుర్తు చేసుకున్నారు.

కృష్ణంరాజు లేని లోటు ఎవరూ పూడ్చలేనిదంటూ  అయన కుటుంబ సభ్యులను ఓదార్చి ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular