Friday, March 29, 2024
Homeసినిమాస‌ల్మాన్ ఖాన్ కి స‌ర్ ఫ్రైజ్ ప్లాన్ చేస్తున్న చ‌ర‌ణ్‌

స‌ల్మాన్ ఖాన్ కి స‌ర్ ఫ్రైజ్ ప్లాన్ చేస్తున్న చ‌ర‌ణ్‌

మెగాస్టార్ చిరంజీవి న‌టించిన లేటెస్ట్ మూవీ ‘గాడ్ ఫాద‌ర్’ ద‌స‌రాకి ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఫ‌స్ట్ డే ఫ‌స్డ్ షో నుంచే హిట్ టాక్ సొంతం చేసుకుని స‌క్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ స‌ల్మాన్ ఖాన్ గెస్ట్ రోల్ చేశారు. పాత్ర చిన్న‌దే అయిన‌ప్ప‌టికీ.. చిరు, స‌ల్మాన్ తెర పై క‌నిపించ‌డం ప్రేక్ష‌కాభిమానుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంది.

ఈ పాత్రతో హిందీలో వసూళ్లు రావడానికి కారణం అయ్యారు సల్మాన్. ఈ సినిమా కోసం సల్మాన్ డబ్బులు తీసుకోవడానికి నిరాకరించాడని చిరంజీవి సక్సెస్ మీట్‌లో వెల్లడించారు. ఇప్పుడు, మెగా క్యాంప్‌ లోని వర్గాల సమాచారం ప్రకారం… రాబోయే రోజుల్లో సల్మాన్ ఖాన్‌కి ఖరీదైన కారును బహుమతిగా ఇవ్వాలని రామ్ చరణ్ నిర్ణయించుకున్నారని తెలిసింది. దాని కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.

సల్మాన్ ఖాన్, మెగాస్టార్ కుటుంబానికి చాలా సన్నిహితుడు. ఆర్ఆర్ఆర్ ప్రమోషన్ల లో రామ్ చరణ్ కు బాగా సహాయం చేశాడు. అందుచేత స‌ల్మాన్ ఖాన్ కి ఈవిధంగా స‌ర్ ఫ్రైజ్ గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటున్నార‌ట‌. ఈ చిత్రం లో నయనతార లేడీ లీడ్ రోల్ లో నటించగా, సత్యదేవ్, పూరి జగన్నాథ్ లు కీలక పాత్రల్లో నటించారు. తెలుగు రాష్ట్రాల్లోనూ, ఓవ‌ర్ సీస్ లోను రికార్డు క‌లెక్ష‌న్స్ తో దూసుకెళుతూ 100 కోట్ల మార్క్ ను దాటింది. మ‌రి.. ఫుల్ ర‌న్ లో గాడ్ ఫాద‌ర్ ఇంకెంత క‌లెక్ట్ చేస్తుందో చూడాలి.

Also Read స‌ల్మాన్ మూవీలో వెంకీ, చ‌ర‌ణ్‌

RELATED ARTICLES

Most Popular

న్యూస్