Thursday, March 19, 2026
HomeTrending Newsరామకృష్ణారెడ్డి కుటుంబానికి సిఎం భరోసా

రామకృష్ణారెడ్డి కుటుంబానికి సిఎం భరోసా

ఇటీవల హత్యకు గురైన శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత చౌళూరు రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులు నేడు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డిని  కలుసుకున్నారు.  రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించిన సిఎం జగన్ ధైర్యంగా ఉండాలని వారికి సూచించారు. కుటుంబానికి అండగా ఉంటామని  భరోసా ఇచ్చారు. హిందూపురం నియోజకవర్గం చౌళూరులో ఇటీవల హత్యకు గురైన  రామకృష్ణారెడ్డి నియోజకవర్గ వైఎస్‌ఆర్‌సీపీ సమన్వయకర్తగా పనిచేశారు.

రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులతో పాటు  అనంతపురం జిల్లా ఇంచార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా సిఎంలు కలిసిన వారిలో ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular