Friday, March 13, 2026
Homeస్పోర్ట్స్Kuldeep Yadav: తొలి టెస్టులో ఇండియా విజయం

Kuldeep Yadav: తొలి టెస్టులో ఇండియా విజయం

బంగ్లాదేశ్ తో జరిగిన తొలి టెస్ట్ లో ఇండియా 188 పరుగులతో విజయం సాధించింది. నిన్న నాలుగోరోజు ఆట ముగిసే సమయానికి విజయం కోసం నాలుగు వికెట్ల దూరంలో ఉన్న ఇండియా నేడు 11.2 ఓవర్లలోనే మిలిగిన నాలుగు వికెట్లూ పడగొట్టి గెలుపు సొంతం చేసుకుంది.

నిన్న 40 పరుగులతో క్రీజులో ఉన్న కెప్టెన్ షకీబ్ అల్ హసన్  84 వద్ద కుల్దీప్ బౌలింగ్ లో బౌల్డ్ గా వెనుదిరగాడు. హసన్ మిరాజ్-13,  తైజుల్-4 పరుగులు మాత్రమే చేయగలిగారు. ఎబాదత్ హోస్సేన్ డకౌట్ అయ్యాడు.

రెండో ఇన్నింగ్స్ లో ఇండియా బౌలర్లలో అక్షర్ పటేల్ 4; కులదీప్ 3; సిరాజ్, ఉమేష్, అశ్విన్ తలా ఒక వికెట్ పడగొట్టారు.

మ్యాచ్ లో 8 వికెట్లు తీసుకున్న కుల్దీప్ యాదవ్ కు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ దక్కింది.

రెండో టెస్ట్ మ్యాచ్ గురువారం (డిసెంబర్ 22)న ఢాకాలోని షేర్ బంగ్లా నేషనల్ స్టేడియంలో మొదలు కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular