వచ్చే ఎన్నికల్లో తెరాస పార్టీకి ఒక్క ఎంపి సీటు కూడా రాదు… బిజెపి స్వీప్ చేస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కెసిఆర్ అవినీతి కుటుంబ పార్టీ లు ఏకం అయిన మోడీ నీ ఏమి చేయలేవన్నారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర ఈ రోజు మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నుంచి ప్రారంభం అవుతోంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ముఖ్యమంత్రి కెసిఆర్ పాలనపై ఘాటుగా విమర్శలు చేశారు. కెసిఆర్.. నరేంద్ర మోడీతో ఏ విషయంలో పోటీ పడుతారని… మీది అవినీతి కుటుంబమని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం మోటర్లకు మీటర్లు పెట్టదని స్పష్టం చేశారు. కెసిఆర్ ఎక్కువ రోజు లు ఉంటే విద్యుత్ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉందన్నారు.
తెలంగాణ రాష్ట్రానికి 40 వేల కోట్లు అప్పు ఉందని, తెలంగాణ రైతులారా, విద్యుత్తు ఉద్యోగులారా కెసిఆర్ ను నమ్మకండని కిషన్ రెడ్డి హెచ్చరించారు. కెసిఆర్ కుటుంబం అవినీతితో ఎంత దోచుకున్నారో కక్కించే ప్రయత్నం బిజెపి చేస్తుందన్నారు. మజ్లిస్ కి బిజెపి భయపడదు…మజ్లిస్ పార్టీ మోచేతి నీళ్ళు తాగుతుంది కెసిఆర్ అని విమర్శించారు. మజ్లిస్ పార్టీ చేతిలో రాష్ట్రాన్ని పెట్టి కెసిఆర్ కు దేశాన్ని ఏలుకోవాలని ఉందా అని ఎద్దేవా చేశారు. ఈ దశాబ్దానికి అతి పెద్ద జోక్ కెసిఆర్ జాతీయ పార్టీ పెట్టడమని, నిజాంని మించిన నిజాం కెసిఆర్ అని వ్యగ్యంగా విమర్శించారు.
కెసిఆర్ అరాచకవాదని, బిజెపి యేతర పార్టీలకు డబ్బులు ఎలా పంపిణీ చేస్తున్నావు కెసిఆర్ అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణలో చెల్లని రూపాయి దేశంలో చెల్లుతుందా అని పరోక్షంగా తెరాస నేతలను… కెసిఆర్ ను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు.
Also Read : మోటర్లకు మీటర్లతో 98 లక్షల కుటుంబాలపై భారం – కెసిఆర్