Friday, June 12, 2026
HomeTrending Newsపేరెంట్స్ భాగస్వామ్యంతో స్కూళ్ళ అభివృద్ధి: సిఎం

పేరెంట్స్ భాగస్వామ్యంతో స్కూళ్ళ అభివృద్ధి: సిఎం

వచ్చే ఏడాది మార్చి నాటికి తొలిదశలో తరగతిగదుల డిజిటలైజేషన్‌ పూర్తి చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అన్నిస్కూళ్లలో ఇంటర్నెట్‌ సదుపాయం ఉండేలా చూడాలని, డిజిటల్‌ లైబ్రరీలు సహా గ్రామ సచివాలయం, ఆర్బీకేలు, విలేజ్‌ క్లినిక్స్‌ అన్నింట్లో ఇంటర్నెట్‌ సదుపాయం  అందుబాటులోకి తేవాలని సూచించారు.  క్యాంప్‌ కార్యాలయంలో పాఠశాల విద్యాశాఖపై సిఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నాడు-నేడు పూర్తయిన స్కూళ్ళలో ఆడిట్, విద్యా కానుక. 8వ తరగతి విద్యార్ధులకు ట్యాబ్ ల పంపిణీ లాంటి అంశాలపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా సిఎం చేసిన సూచనలు:

  • నాడు – నేడు కింద పనులు పూర్తిచేసుకున్న స్కూళ్లపై నిరంతరం ఆడిట్‌ చేయాలి
  • స్కూళ్లకు కల్పించిన సౌకర్యాలు బాగున్నాయా? లేదా? అన్నది పరిశీలన చేసి అవసరమైన చోట వెంటనే పనులు, మరమ్మతులు చేయించాలి
  • వచ్చే ఏడాది జూన్‌లో స్కూళ్లు తెరిచే నాటికి విద్యాకానుక పిల్లల చేతికి కచ్చితంగా అందించాలి
  • యూనిఫామ్స్‌ కుట్టు ఛార్జీలను విద్యాకానుక ప్రారంభం రోజునే తల్లుల ఖాతాల్లోకి వేయాలన్న సీఎం.
  • స్కూళ్ల నిర్వహణలో పేరెంట్స్‌ కమిటీలను నిరంతరం యాక్టివేట్‌ చేయాలి. స్కూళ్ల అభివృద్ధి, నిర్వహణలపై తరచుగా వారితో సమావేశాలు నిర్వహించాలి
  • గ్రామంలో పారిశుద్ధ్యం, తాగునీటిలో నాణ్యత నిర్ధారణ అంశాలను విలేజ్‌ క్లినిక్‌ పరిధిలోకి తీసుకురావాలి
  • దీంతో పారిశుద్ధ్య లోపం వల్ల వచ్చే రోగాలను చాలావరకు నివారించడానికి అవకాశం ఉంటుంది.
  • మండలస్థాయిలో ఉండే విద్యాశాఖ అధికారుల్లో (ఎంఈఓ) ఒకరికి అకడమిక్‌ వ్యవహారాలు, మరొకరికి స్కూళ్ల నిర్వహణా అంశాలు అప్పగించాలి
  • టీచర్లకు, 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌ల పంపిణీని సమీక్షించిన సీఎం.
  • 5,18,740 ట్యాబ్‌లను కొనుగోలు చేయనున్న ప్రభుత్వం. ట్యాబ్‌ల్లో బైజూస్‌ కంటెంట్‌.
  • తరగతి గదులను డిజిటలీకరణ చేసే కార్యక్రమంలో భాగంగా స్మార్ట్‌ టీవీలను, ఇంటరాక్టివ్‌ టీవీలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం.
  • దాదాపు 72,481 యూనిట్లు అవసరమని అంచనావేసిన అధికారులు.
  • దశలవారీగా వీటిని తరగతిగదుల్లో ఏర్పాటు చేయనున్న ప్రభుత్వం.
  • దాదాపు రూ. 512 కోట్లుపైగా ఖర్చు అవుతుందని అంచనా.

ఈ సమీక్షా సమావేశంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్‌ సమీర్‌ శర్మ, పాఠశాల విద్యాశాఖ స్పెషల్‌ సీఎస్‌ బుడితి రాజశేఖర్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ ఎస్‌ సురేష్‌ కుమార్, స్కూల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కమిషనర్‌ కాటమనేని భాస్కర్, ఇంటర్‌ మీడియట్‌ ఎడ్యుకేషన్‌ కమిషనర్‌ ఎం వీ శేషగిరిబాబు, పాఠశాల విద్యాశాఖ సలహాదారు ఏ మురళీ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Also Read:కృష్ణం రాజు మృతికి సిఎం జగన్ సంతాపం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular