Friday, June 12, 2026
Homeసినిమామహేష్‌ మూవీ వచ్చేది ఎప్పుడు..?

మహేష్‌ మూవీ వచ్చేది ఎప్పుడు..?

మహేష్‌ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో ‘అతడు’, ‘ఖలేజా’ చిత్రాలు రూపొందడం.. ఈ రెండు చిత్రాలు ఇద్దరికీ మంచి పేరు తీసుకురావడం తెలిసిందే. ఇప్పుడు మహేష్‌, త్రివిక్రమ్ కలిసి హ్యాట్రిక్ మూవీ చేస్తున్నారు. ఇందులో మహేష్ కు జంటగా పూజా హేగ్డే, శ్రీలీల నటిస్తున్నారు. ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ ఏమాత్రం రాజీపడకుండా మంచి క్వాలిటీతో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

అయితే.. ఇటీవల ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయ్యింది. రెండో షెడ్యూల్ ను ఈ నెల 20 నుంచి స్టార్ట్ చేయనున్నారు. ఈ చిత్రాన్ని ఆగష్టు 11న విడుదల చేయనున్నట్టుగా ప్రకటించారు. పక్కా ప్లానింగ్ తో ఏమాత్రం ఆలస్యం కాకుండా అనుకున్న టైమ్ కి షూటింగ్ కంప్లీట్ అయ్యేలా ప్లాన్ చేశారు. అయితే.. మహేష్ పెళ్లి రోజు (ఫిబ్రవరి 10) సందర్భంగా ఓ వారం రోజులు ఫారిన్ ట్రిప్ కి వెళ్లారు. ఈ కారణంగా షూటింగ్ కి బ్రేక్ పడింది. దీంతో ఆగష్టు 11న ఈ సినిమా రావడం కష్టమే అని అందుచేత ఈ సినిమాను దసరాకి విడుదల చేయాలి అనుకుంటున్నారని వార్తలు వచ్చాయి.

దసరాకి ‘భోళా శంకర్’, పవర్ స్టార్ వీరమల్లు,’ జైలర్’, ‘ఇండియన్ 2’ సినిమాలు వస్తున్నాయి. అయితే.. మహేష్‌ మూవీని దసరాకి కాకుండా ముందుగా ప్రకటించినట్టుగా ఆగష్టు 11నే విడుదల చేయాలి అనుకుంటున్నారట. అందుకనే ఎట్టి పరిస్థితుల్లోనే ఆగష్టు 11 డేట్ మిస్ కాకుండా ఉండేందుకు మహేష్‌ బాబు మార్నింగ్ సెవెన్ కే షూటింగ్ కి వచ్చేసేవారట. ఈ నెల 20 నుంచి తాజా షెడ్యూల్ మరింత ఫాస్ట్ గా కంప్లీట్ అయ్యేలా ప్లాన్ చేశారని సమాచారం. అందుచేత మహేష్‌ మూవీ ఆగష్టు 11న రావడం పక్కా అంటున్నారు మేకర్స్.

Also Read : దసరాకి పోటీపడనున్న ఆ నలుగురు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular