ఎన్టీఆర్ నెక్ట్స్ మూవీని కొరటాల శివ డైరెక్షన్ లో చేయనున్నారు. ఈ చిత్రాన్ని ఎప్పుడో ప్రకటించారు. అయితే.. కొరటాల తెరకెక్కించిన ఆచార్య డిజాస్టర్ అవ్వడంతో ఎన్టీఆర్ తో చేయనున్న సినిమా కథ పై కసరత్తు చేస్తూనే ఉన్నారు. ఫైనల్ గా అంతా సెట్ అయ్యింది. ఈ నెలలో పూజా కార్యక్రమాలతో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు. వచ్చే నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనున్నారు. ఇందులో ఎన్టీఆర్ కు జంటగా జాన్వీ కపూర్ నటించనుంది. కోలీవుడ్ స్టార్ విక్రమ్ కీలక పాత్ర పోషించనున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.

ఇదిలా ఉంటే.. ఎన్టీఆర్, కోలీవుడ్ డైరెక్టర్ వెట్రిమారన్ డైరెక్షన్ లో ఓ సినిమా చేయనున్నారని వార్తలు వస్తున్నాయి. వెట్రిమారన్ ఎప్పటి నుంచో ఎన్టీఆర్ తో టచ్ లో ఉన్నాడు. వీరిద్దరూ కలిసి సినిమా చేయాలి అనుకున్నారు కానీ.. ఇప్పటి వరకు సెట్ కాలేదు. ఇప్పుడు వెట్రిమారన్ చెప్పిన స్టోరీకి ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. అంతే కాకుండా.. ఈ మూవీ కోసం దర్శకుడు వెట్రిమారన్ కు మైత్రీ మూవీ మేకర్స్ వారు 5 కోట్లు అడ్వాన్స్ కూడా ఇచ్చారని టాక్. ఈ క్రేజీ మూవీలో ఎన్టీఆర్ తో పాటు ఈ మూవీలో తమిళ హీరో కూడా నటించనున్నాడని ప్రచారం జరుగుతుంది.

ఇంతకీ ఈ మూవీలో నటించే కోలీవుడ్ హీరో ఎవరంటే.. ధనుష్ అని టాక్. కారణం ఏంటంటే వెట్రిమారన్ సినిమాల్లో అత్యధిక శాతం ధనుష్ నటించాడు. ఆ కారణంగానే ధనుష్ ఈ మల్టీస్టారర్ లో నటించే అవకాశం వుందని టాక్.ఇక ఈ సినిమా పాన్ ఇండియా మల్టీస్టారర్ గా తెర పైకి రానుందని 2025లో ఈ మూవీ షూటింగ్ ని మొదలు పెట్టే అవకాశం వుందని తమిళ మీడియాలో ఆసక్తికరమైన కథనాలు వినిపిస్తున్నాయి. తెలుగు ప్రేక్షకులతో పాటు తమిళ ప్రేక్షకులకు కూడా ఇదొక భారీ ప్రాజెక్ట్ అవుతుందని అప్పుడే భారీ లెక్కలు కూడా వేస్తుండటం ఆసక్తిగా మారింది.

Also Read: ఎన్టీఆర్ మూవీలో విక్రమ్?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *