Sunday, January 19, 2025
HomeTrending Newsతమిళనాడులో మాండస్‌ తుఫాను బీభత్సం

తమిళనాడులో మాండస్‌ తుఫాను బీభత్సం

మాండస్‌ తుఫాను తమిళనాడులో బీభత్సం సృష్టించింది. రాజధాని చెన్నైతో పాటు సమీప చెంగల్‌పట్టు, కాంచీపురం, విల్లుపురం జిల్లాల్లో శనివారం భారీ వర్షాలు కురిశాయి. మహాబలిపురం వద్ద శుక్రవారం అర్ధరాత్రి తర్వాత తీరం దాటిన తుఫాను.. తర్వాత క్రమంగా బలహీనపడి తీవ్ర అల్పపీడనంగా మారింది. చెన్నై నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. తుఫాను తీరం దాటుతున్న సమయంలో గంటలకు 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. దాదాపు 400 వృక్షాలు నేలకూలాయి. చెట్లు కరెంట్‌ స్తంభాలపై పడటంతో పలు ప్రాంతాల్లో విద్యుత్తు అంతరాయం ఏర్పడింది. దాదాపు 9 వేల మంది తుఫాను ప్రభావిత ప్రజలను రిలీఫ్‌ సెంటర్లకు తరలించారు. వర్షం సంబంధిత ఘటనల్లో నలుగురు మరణించారని, 181 ఇండ్లు ధ్వంసమయ్యాయని సీఎం ఎంకే స్టాలిన్‌ వెల్లడించారు. అధికారులు విరిగిపడిన చెట్లను తొలగించి, విద్యుత్తు సరఫరాను పునరుద్ధరించే పనిలో ఉన్నారని తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్