Saturday, March 14, 2026
HomeTrending Newsమునుగోడు బరిలో 47 మంది అభ్యర్థులు

మునుగోడు బరిలో 47 మంది అభ్యర్థులు

మునుగోడు ఉప ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ గడువు నేటితో ముగిసింది. ఈ ఉప ఎన్నికకు మొత్తం 130 మంది అభ్యర్థులు 190 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో 47 మంది నామినేషన్లు తిరస్కరించబడ్డాయి. మిగిలిన 83 మందిలో 36 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. మొత్తంగా ఉప ఎన్నిక బరిలో 47 మంది ఉన్నట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు.
అయితే మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చొరవతో మునుగోడు ఉప ఎన్నిక బరిలో నిలిచిన 13 మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. నిన్న పది మంది, ఇవాళ ముగ్గురు నామినేషన్లను ఉపసంహరించుకుని టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి మద్దతు ప్రకటించారు.

మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ తరపున కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, బీజేపీ తరపున కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి పాల్వాయి స్రవంతి రెడ్డి బరిలో ఉన్నారు. ఈ ముగ్గురి మధ్య ప్రధాన పోటీ నెలకొంది.

Also Read: మునుగోడులో కుక్కల కొట్లాట వైఎస్ షర్మిల విమర్శ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular