నాగ్‌పూర్‌ స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపికి షాక్

నాగ్‌పూర్‌లో పంచాయతీ సమితిల చైర్‌పర్సన్‌లు, డిప్యూటీ చైర్‌పర్సన్‌ల ఎంపిక కోసం జరిగిన ఎన్నికల్లో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మొత్తం 13 పంచాయతీ సమితిలకు ఎన్నికలు జరుగగా ఒక్కటంటే ఒక్క చైర్‌పర్సన్‌ పదవిని కూడా బీజేపీ దక్కించుకోలేకపోయింది. కేవలం మూడంటే మూడు డిప్యూటీ చైర్‌పర్సన్‌ పదవులతో సరిపెట్టుకుంది.

మహారాష్ట్ర బీజేపీ చీఫ్‌ చంద్రశేఖర్‌ బవాంకులే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌, కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ నాగ్‌పూర్‌ వాసులు. ఇంతమంది హేమహేమీల స్వస్థలమైన నాగ్‌పూర్‌లో బీజేపీ ఘోర పరాజయం మూటగట్టుకోవడం ఆ పార్టీ పతనాన్ని సూచిస్తున్నదని ప్రతిపక్ష కాంగ్రెస్‌ వ్యాఖ్యానించింది.

కాగా, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ జయభేరి మోగించింది. మొత్తం 13 పంచాయతీ సమితిల్లో 9 చైర్‌పర్సన్‌ పదవులు, 8 డిప్యూటీ చైర్‌పర్సన్ పదవులను కాంగ్రెస్‌ దక్కించుకుంది. శరద్‌పవార్‌ నేతృత్వంలోని నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీకి మూడు చైర్‌పర్సన్‌ పదవులు దక్కాయి. మరో చైర్‌పర్సన్ పదవిని శివసేన తన ఖాతాలో వేసుకుంది.

Also Read: కాంట్రాక్టుల కోసమే బీజేపీలోకి కోమటిరెడ్డి: మంత్రి జగదీశ్‌ రెడ్డి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *