Thursday, June 11, 2026
HomeTrending Newsరియల్ వ్యాపారులకు రైతుబంధు - ఈటెల విమర్శ

రియల్ వ్యాపారులకు రైతుబంధు – ఈటెల విమర్శ

ప్రజలను చంపి సంపాదిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కెసిఆర్ అని బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ విమర్శించారు. కళ్యాణలక్ష్మీ, పెన్షన్, రైతుబంధు పథకాలకు 22 వేలకోట్లు,  సంక్షేమ హాస్టళ్లులాంటివి అన్నీ కలిపి 25 వేల కోట్లు కెసిఆర్  ఖర్చు పెడుతున్నారని, అయితే ప్రతి వందమందికి ఒక బెల్ట్ షాప్ పెట్టి తాగుపించి 45 వేల కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారని ఆరోపించారు. మునుగోడు ఎన్నికల ప్రచారంలో భాగంగా… చౌటుప్పల్ మండలం తూఫ్రాన్ పేటలో ఈ రోజు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఈటల రాజేందర్.

రైతుబందు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఇస్తున్న సీఎంకు కౌలు రైతులకు ఇవ్వడానికి మనసురావడం లేదని ఈటెల విమర్శించారు. దళిత బంధు ఐఏఎస్ ఆఫీసర్స్ కి ఇస్తావా? అన్నారు. పేదలకు ఇవ్వు తప్ప అధికారులకు కాదని హితవు పలికారు. గిరిజనబంధు మునుగోడు నియోజకవర్గంలో ఉన్న 33 తండాల గిరిజన ఓట్ల కోసం వచ్చింది తప్ప వాళ్ళ మీద  ప్రేమ కోసం కాదన్నారు. నా భార్య జమున  కెసిఆర్ నువ్వు నమ్మక ద్రోహివి అని బహిరంగంగా చెప్పింది. ఉద్యమ సమయంలో సంపాదించిన డబ్బులు ఇచ్చిన. ఇప్పుడు  నా ఆస్తులు తెగనమ్ముత కెసిఆర్ మీద కొట్లాట మాత్రం అపవద్దు అని భరోసా ఇచ్చిందన్నారు. జమున ఈ నియోజక వర్గం మట్టి బిడ్డ అని రాజగోపాల్ రెడ్డి కష్టం చూసి ఆమె అమ్మగారి ఊరు పలివెలకు వచ్చి ధర్మాన్ని కాపాడమని కోరిందన్నారు.

ఇక్కడ ప్రచారానికి వచ్చిన ఎమ్మెల్సీ ఆమెకు ఇక్కడేం పని?  ఇక్కడికి ఎందుకు వచ్చింది అంటడట..పుట్టిన గడ్డ ఆమె సొంత ఊరికి రావొద్దట. ఎక్కడో ఉన్న వాడు ఇక్కడికి వచ్చి ఉంటాడట. ఆయన చేసేది ఎంది యువకులకు తాగిపించడం. అరే కబర్ధార్ మా జోలికి వస్తే మాడి మసి అవుతారని ఈటెల హెచ్చరించారు.

ఎన్నికల కమీషన్, పోలీసులను కోరుతున్న స్వేచ్చగా అన్ని పార్టీలు ప్రచారం చేసుకొనే అవకాశం కల్పించాలి. లేకపోతే జరిగే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని రాజేందర్ హెచ్చరించారు. కెసిఆర్ శాశ్వతంగా పాలించడానికి రాలేదు. 2023 వరకే ఆయన ఉంటారు.  అధికారులు ఆయన బానిసలు కాదు. కెసిఆర్ బానిసల్లాగ పని చేసే అధికారులు, పోలీసులు బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత మీ భరతం పట్టడం ఖాయమన్నారు. మోడీ గీడి ఎవరు వెంట్రుక కూడా పీకలేరు అని ఒకాయన మాట్లాడుతున్నారని, స్థాయిని బట్టి మాట్లాడాలి. ఎది పడితే అది మాట్లాడితే కుదరదు. మీ మాటలు అన్నీ తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని ఈటెల రాజేందర్ అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular