ఇతరులకు అవకాశం లేని ఓ రాజధానిగా అమరావతిని చేయాలని మీరు చేసే ప్రయత్నాన్ని ఎలా హర్షించగలమని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలుగుదేశం పార్టీని ప్రశ్నించారు. గడి గడికీ రాజధాని మారకూడదని చెబుతున్నారని, మద్రాస్ నుంచి కర్నూలు కు, అక్కడినుంచి హైదరాబాద్ కు, మళ్ళీ అమరావతికి రాజధాని మారిందని గుర్తు చేశారు.  అమరావతి రాజధాని కావాలని చెప్పే హక్కు పాదయాత్ర చేసే వారికి ఉందని… కానీ విశాఖ రాజధాని వద్దు అనే హక్కు వారికి లేదన్నారు.

రాజ్యాంగం ఏమి చెబుతోంది, గత అనుభవాలు ఏమి చెబుతున్నాయనే విషయాన్ని దృష్టిలో ఉంచుకొని, హైదరాబాద్ లో జరిగిన విషయాలు గమనించి నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. ఇదే విషయాన్ని సిఎం జగన్ చెబితే ఆయనపై దుమ్మెత్తి పోస్తున్నారని, తాము మాట్లాడితే.. నాలుకా, తాటి మట్టా అంటూ విమర్శలు చేస్తున్నారు కానీ తాము అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పడం లేదని ధర్మాన విమర్శించారు.  తమ ఆవేదన చెప్పుకే అవకాశం కూడా లేదా అంటూ నిలదీశారు. వైఎస్సార్ కాంగ్రెస్ అసలు అభివృద్ధి చేయలేదని చెబుతున్నారని, తాము అధికారంలోకి వచ్చి మూడున్నరేళ్ళు అయితే దానిలో రెండేళ్ళు కరోనాకే పోయిందని గుర్తు చేశారు. జిల్లాలు కొత్తవి ఎప్రాటు చేశారని, అన్ని జిల్లాల్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు  పెడుతున్నారని,  అన్ని ఐటిడిఏ ప్రాంతాల్లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు మంజూరు చేశారని, ప్రభుత్వ స్కూళ్ళను నాడు-నేడుతో బాగు చేయిస్తున్నారని వివరించారు. ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యకు పరిష్కారం చూపారన్నారు.

ఇప్పటికే ఉత్తరాంధ్ర వెనుకబడిందని, ఇప్పటికైనా అన్నిప్రాంతాలూ సమానంగా అభివృద్ధి చెందాలని, ఇంకా ఈ ప్రాంతాలను దోచుకోవడం సరికాదని హితవు పలికారు.

Also Read : జిల్లాకు ఒక్క కేంద్ర సంస్థ తేలేకపోయారు: ధర్మాన

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *