Friday, June 12, 2026
Homeసినిమా'నేను స్టూడెంట్ సార్!' టీజర్ రిలీజ్ డేట్

‘నేను స్టూడెంట్ సార్!’ టీజర్ రిలీజ్ డేట్

బెల్లంకొండ గణేష్ యాక్షన్ థ్రిల్లర్ ”నేను స్టూడెంట్ సార్!’. ఎస్వీ2 ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో ప్రొడక్షన్ నంబర్ 2 గా వస్తున్న ఈ చిత్రాన్ని సతీష్ వర్మ నిర్మిస్తుండగా దర్శకుడు రాకేష్ ఉప్పలపాటి దర్శకత్వం వహిస్తున్నారు. దర్శకుడు కృష్ణ చైతన్య కథను అందించారు. ఫస్ట్ లుక్ పోస్టర్ల ద్వారా ప్రధాన పాత్రలందరినీ పరిచయం చేసిన మేకర్స్, తాజాగా ఓ ఫన్నీ వీడియో ద్వారా సినిమా టీజర్ రిలీజ్ డేట్ ని ప్రకటించారు. ఈ వీడియోలో గణేష్‌ని టీజర్ గురించి వేర్వేరు వ్యక్తులు అడగడం, ఫైనల్ అతను టీజర్ తేదీని రివిల్ చేయడం ఆసక్తికరంగా వుంది.

నేను స్టూడెంట్ సార్! టీజర్ నవంబర్ 12న విడుదలౌతుంది. పోస్టర్‌లో గణేష్ సీరియస్ లుక్‌లో కనిపిస్తున్నారు. అలాగే గణేష్‌ పై ఎటాక్ చేసేందుకు బస్‌లు చుట్టుముట్టడం గమనించవచ్చు. ఈ చిత్రంతో అవంతిక దస్సాని హీరోయిన్ గా అరంగేట్రం చేస్తోంది. సముద్రఖని, సునీల్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు. అనిత్ మధాడి డీవోపీగా, చోటా కె ప్రసాద్ ఎడిటర్ గా పని చేస్తున్నారు. కళ్యాణ్ చక్రవర్తి ఈ చిత్రానికి డైలాగ్స్ అందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular