Friday, June 12, 2026
HomeTrending Newsప్రధాని మోడీతో భేటీ కానున్న పవన్!

ప్రధాని మోడీతో భేటీ కానున్న పవన్!

రేపు విశాఖపట్నం పర్యటనకు వస్తున్న ప్రధానమంత్రి నరేంద్రమోడీ, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తో సమావేశం కానున్నారు. రేపు సాయంత్రం లేదా ఎల్లుండి ఉదయం ప్రధాని కలిసే అవకాశం ఉందని, అందుబాటులో ఉండాలంటూ ప్రధానమంత్రి కార్యాలయం పవన్ కు సమాచారం పంపినట్లు తెలిసింది. విశాఖ నగరంలో ఇఎన్ఎస్ చోళాలో  ప్రధాని బస చేయనున్నారు. అక్కడే రేపు రాత్రి ఎనిమిదిన్నరకు పవన్ ప్రధానితో సమావేశం కానున్నారు. రేపు మధ్యాహ్నం  బేగంపేట్ నుంచి ప్రత్యెక విమానంలో పవన్ విశాఖ వెళ్లనున్నారు.

వచ్చే ఎన్నికల్లో బిజెపి-జనసేన కలిసి పోటీ చేస్తాయని చెబుతోన్న బిజెపి రాష్ట్ర నేతలు ప్రధానితో పవన్ సమావేశాన్ని ఏర్పాటు చేశారని విశ్వసనీయ వర్గాల ద్వారా వెల్లడైంది.  ఇటీవల పవన్ విశాఖ పర్యటన దృష్ట్యా తలెత్తిన ఉద్రిక్తత, ఆ తర్వాత పవన్ తో చంద్రబాబు భేటీ లాంటి కీలక పరిణామాలతో బిజెపి నేతలు అలెర్ట్ అయ్యారు.  బిజెపిపై పవన్ అసహనంతో ఉన్నారని, అందుకే తెలుగుదేశం పార్టీతో కలిసి ముందుకు వెళ్లనున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే బిజెపి రాష్ట్ర నేతలు ఢిల్లీ స్థాయిలో ఒత్తిడి తీసుకు వచ్చి పవన్ ను ఎలాగైనా తమతోనే కలిసి ఉండేలా ప్రణాలికలు సిద్ధం చేస్తున్నారు. దీనిలో భాగంగానే రేపటి భేటీ ఏర్పాటు చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular