Friday, March 29, 2024
HomeTrending Newsసిఎంకు కురువ సంఘాల కృతజ్ఞతలు

సిఎంకు కురువ సంఘాల కృతజ్ఞతలు

హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ నేతృత్వంలో మదాసి కురువ, మదారి కురువ సంఘాల ప్రతినిధులు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో కలుసుకున్నారు.  ఇప్పటివరకు మదాసి కురువ, మదారి కురువ కులాలకు ఇచ్చే కుల ధ్రువీకరణ పత్రాన్ని ఆర్డీవో పరిధి నుంచి ఎమ్మార్వో పరిధిలోకి మారుస్తూ ఇటీవల ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.  ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తమకు ఎంతో ప్రయోజనకరమని సంతోషం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రికి కురువ సంఘాల ప్రతినిధులు కృతజ్ఞతలు తెలియజేశారు.

కురువ సాంప్రదాయం ప్రకారం కంబలి కప్పి ముఖ్యమంత్రిని సన్మానించిన ప్రతినిధులు, తమ కులస్ధులు ఎదుర్కుంటున్న సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్ళారు. దీనిపై సిఎం సానుకూలంగా స్పందించారు. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌తో పాటుమదాసి కురువ, మదారి కురువ సంఘాల ప్రతినిధులు సుంకన్న, శివలింగ, సోమలింగ, సాయిరామ్, మద్దిలేటి తదితరులు  ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఉన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్