Tuesday, March 17, 2026
HomeTrending Newsఉత్తరకొరియా క్రూయిజ్ క్షిపణి ప్రయోగం

ఉత్తరకొరియా క్రూయిజ్ క్షిపణి ప్రయోగం

ఉత్తర కొరియా రెండు క్రూయిజ్‌ క్షిపణులను ప్రయోగించింది. ఈ ఏడాది నెలరోజుల విరామం తర్వాత ఉత్తర కొరియా రికార్డు బ్రేక్‌ చేస్తూ రెండు క్షిపణులను ప్రయోగించింది. ఈ మేరకు దక్షిణ కొరియా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. బుధవారం తెల్లవారుజామున  ప్యోంగాన్‌ ప్రావిన్స్‌లోని ఓంచోన్‌ నుంచి పశ్చిమ సముద్రంలోకి ఉత్తర కొరియా రెండు క్రూయిజ్‌ క్షిపణులను పేల్చినట్లు గుర్తించామని దక్షిణ కొరియా రక్షణ మంత్రిత్వశాఖ అధికారి పేర్కొన్నారు.

ఎంత దూరం నుంచి ఈ క్షిపణుల ప్రయోగం జరిగిందనే కోణంలో యూఎస్‌, దక్షిణ కొరియా సైనిక అధికారులు విశ్లేషిస్తున్నారు. ఉత్తర కొరియా చివరిసారిగా జులై 10న ఆయుధ పరీక్ష నిర్వహించింది. ఇది బహుళ రాకెట్‌ లాంచర్‌లను ఫైర్‌ చేయగల క్షిపణి. ఐతే ఉత్తరకొరియా న్యూస్‌ ఛానెల్‌ ఒక్క క్రూయిజ్‌ క్షిపణిని ప్రయోగించలేదని పేర్కొనడం గమనార్హం.

వాస్తవానికి ఉత్తరకొరియా 2017 నుంచి తొలిసారిగా పూర్తి స్థాయిలో ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణి ప్రయోగించింది. అప్పటి నుంచి పలుమార్లు ఐక్యరాజ్యసమితి నిబంధనలను  ఉల్లంఘిస్తూ పరీక్షలు నిర్వహిస్తూనే ఉంది. ఉత్తర కొరియా దూకుడు వ్యవహరంతో యూఎస్‌, దక్షిణ కొరియా అధికారులు కూడా అణు పరీక్షలకు సిద్ధమవుతున్నమని గట్టిగా హెచ్చరించారు. వంద రోజుల పాలన పూర్తి అయిన సందర్భంగా దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ మాట్లాడుతూ..ఉత్తర కొరియా అణు పరీక్షలు నిలిపివేస్తే తమ దేశం ఆర్థిక సాయం చేస్తుందని వెల్లడించారు.  దక్షిణ కొరియా అధ్యక్షుడు ప్రకటించిన కొద్ది రోజుల్లోనే ఉత్తర కొరియా తాజాగా క్షిపణుల ప్రయోగానికి దిగటం గమనార్హం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular