ఉత్తరాఖండ్‌లో కుండపోతగా వర్షాలు పడుతున్నాయి. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో రెండు రోజులుగా పడుతున్న వానలకు నదులన్నీ నిండుగా ప్రవహిస్తున్నాయి. ఎడతెరిపి లేని వానలకు చమోలీ జిల్లాలో కీలకమైన హైవేపై కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో బద్రీనాథ్ టూరిస్టులు చిక్కుకుపోయారు. భారీ వర్షం వల్ల ఆ ప్రాంతంలో కొండచరియలు కూలాయి. చమోలీ జిల్లాలోని చిన్కా వద్ద ఈ ఘటన జరిగింది. మరో వైపు ఉత్తరాఖండ్‌కు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. భారీ వర్షాలు కురవనున్నట్లు ఐఎండీ హెచ్చరించింది. ఇవాళ ఉదయం ఢిల్లీలో కూడా వర్షం పడింది. ఉష్ణోగ్రతలు తగ్గాయి. కొన్ని ప్రాంతాల్లో వర్షపు నీరు జామైంది.
Badrinath: ఉత్తరాఖండ్‌లో భారీ వర్షం..బద్రీనాథ్ రోడ్ బ్లాక్
కొన్ని రోజుల క్రితం హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు టూరిస్టులు చిక్కుకున్న విషయం తెలిసిందే. మనాలీలో దాదాపు 300 మంది టూరిస్టులు మూడు రోజుల పాటు ఎటూ కదలలేకపోయారు. దాదాపు 15 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోయింది. మండీ.. కుల్లు రూట్లో ఆ జామైంది. హిమాచల్‌లో వర్షాల వల్ల 19 మంది మరణించారు.