Sunday, March 8, 2026
Homeసినిమాఎనలేని ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు : పవన్ కళ్యాణ్‌

ఎనలేని ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు : పవన్ కళ్యాణ్‌

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సినీ, రాజకీయ ప్రముఖులు, సన్నిహితులు, అభిమానులు పవన్ కళ్యాణ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియచేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ స్పందిస్తూ “నా చుట్టూ ఉన్న సమాజం ఎల్లవేళలా క్షేమంగా ఉండాలనే భగవంతుణ్ణి ప్రార్థిస్తుంటాను. యేడాదిన్నర కాలంగా దేశం కరోనా మహమ్మారితో పోరాడుతూనే ఉంది. సెకండ్ వేవ్ ప్రభావం నుంచి ఇప్పుడిప్పుడే కుదుటపడుతుంది. కష్ట జీవుల జీవనం ఇంకా గాడిన పడలేదు. ఇలాంటి క్లిష్ట సమయంలో జన్మదిన శుభాకాంక్షలు అందుకోలేను అనే ఉద్దేశంతో దైవ చింతనలో గడిపాను. సహజంగానే నేను పుట్టిన రోజు వేడుకలకు దూరంగా ఉంటానని నన్ను అభిమానించే వారికి తెలుసు”.

“నాపై ఉన్న అపార ప్రేమాభిమానాలతో ఎందరో శ్రేయోభిలాషులు, సమాజ సేవకులు, రాజకీయ నేతలు, సినీ తారలు, దర్శకులు, సాంకేతిక నిపుణులు, మీడియా ప్రతినిధులు, ప్రవాస భారతీయులు, నన్ను తమలో ఒకడిగా భావించే అభిమానులు, జన సైనికులు, వీర మహిళలు, జనసేన నాయకులు సామాజిక మాధ్యమాల ద్వారా శుభాకాంక్షలు అందచేశారు. జనసేన శ్రేణులు, అభిమానులు సామాజిక సేవ కార్యక్రమాలు చేపట్టి తమ అభిమానాన్ని సేవా మార్గంలో వెల్లడించారు. పెద్దలు, రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నవారు శుభాశీస్సులు అందించారు. ప్రతి ఒక్కరూ ఎంతో వాత్సల్యంతో నాకు శుభాకాంక్షలు అందించారు. వెల కట్టలేని ఈ అభిమానానికి, వాత్సల్యానికి నేను సర్వదా కృతజ్ఞుడిని. అందరికీ పేరుపేరునా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియచేస్తున్నాను” అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular