Monday, March 16, 2026
HomeసినిమాChiranjeevi 45 Years Journey: మెగాస్టార్‌ చిరంజీవికి గ్లోబల్ స్టార్ అభినందనలు

Chiranjeevi 45 Years Journey: మెగాస్టార్‌ చిరంజీవికి గ్లోబల్ స్టార్ అభినందనలు

చిరంజీవి.. తెలుగు సినీ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు. సామాన్యుడిగా చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించి ఇంతింతై వటుడింతైనట్లు అసామాన్యుడుగా.. మెగాస్టార్‌గా ఎదిగారు. నాటి నుంచి నేటికీ.. కొన్ని కోట్ల మందికి స్ఫూర్తినిస్తూ తన అలుపెరుగని ప్రయాణాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. ఎన్నో విజయాలు.. ఎన్నో అవార్డులు అన్నింటికీ మించి ప్రేక్షక హృదయాల్లో చిరంజీవి అయ్యారు. ఆయన చిత్ర సీమలోకి ప్రవేశించి 45 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఆయన తనయుడు, గ్లోబల్ స్టార్, రామ్ చరణ్ అభినందనలు తెలియజేశారు.

‘‘సినీ పరిశ్రమలో 45 సంవత్సరాల మెగా జర్నీని పూర్తి చేసుకున్న మన ప్రియమైన మెగాస్టార్‌కి హృదయపూర్వక అభినందనలు. ఆయన ప్రయాణం ఎంతో గొప్పది. ప్రాణం ఖరీదుతో ప్రారంభమైన ఈ జర్నీలో ఆయన మనల్ని ఇప్పటికీ అబ్బురపరుస్తూనే ఉన్నారు.  వెండితెర పై అద్భుతమైన నటనతో, బయట మీ మానవత్వంతో కూడిన మీ కార్యకలాపాలను కొనసాగిస్తూ కొన్ని కోట్ల మందిని ఇన్‌స్పైర్ చేస్తూనే ఉన్నారు. క్రమశిక్షణ, కష్టించే తత్వం, అంకిత భావం వంటి విలువలతో పాటు వాటన్నింటినీ మించి మాలో కరుణను పెంపొందించిన నాన్న గారికి ధన్యవాదాలు’’ అని అన్నారు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్.

చిరంజీవి కొత్త సినిమా విషయానికి వస్తే.. బింబిసార డైరెక్టర్ మల్లిడి వశిష్ట్ తో సినిమా చేయనున్నారు. ఈ చిత్రాన్ని యు.వీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తుంది. భారీ సోషియో ఫాంటసీ మూవీగా రూపొందే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. నవంబర్ నుంచి ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకురానున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular