Saturday, July 27, 2024
HomeసినిమాSai Pallavi: పెళ్లి గురించి అసలు విషయం బయటపెట్టిన సాయిపల్లవి

Sai Pallavi: పెళ్లి గురించి అసలు విషయం బయటపెట్టిన సాయిపల్లవి

సాయిపల్లవి పెళ్లి చేసుకుందట. అది కూడా ఎవరికీ చెప్పకుండా సీక్రెట్ గా మ్యారేజ్ చేసుకుందట. ఈ వార్త ఇటీవల సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. అయితే.. ప్రచారంలోకి వచ్చిన ఓ ఫోటోలో సాయిపల్లవి, వేరే వ్యక్తితో కలిసి ఉండడం.. ఆ ఫోటోలో ఇద్దరు దండలు వేసుకుని ఉండడంతో నిజంగానే పెళ్లి చేసుకుంది అనుకున్నారు. అయితే.. తన పై వచ్చే పుకార్లకు అంతగా స్పందించని ఈ ఫిదా బ్యూటీ ఇప్పుడు మాత్రం సోషల్ మీడియాలో రియాక్ట్ అయ్యింది. పెళ్లి వార్తలను ఖండించింది.

ఇంతకీ సాయిపల్లవి ఏం చెప్పిందంటే.. నిజం చెప్పాలంటే.. పుకార్లను పట్టించుకోను కానీ.. అది కుటుంబ సభ్యులైన స్నేహితులతో లింకు అయిన ఉన్నప్పుడు మాట్లాడాలి. ఓ సినిమా పూజా కార్యక్రమంలో దిగిన ఫోటో తీసుకుని దానిని కావాలనే క్రాప్ చేసి ఇలా ప్రచారం చేశారు. కొంత మంది కావాలనే ఈ పని చేశారు. నా కొత్త సినిమాకి సంబంధించిన వార్తను షేర్ చేయాలి అనుకుంటున్న టైమ్ లో ఈ పనికిమాలిన పనులు నన్ను నిరుత్సాహపరిచాయి. ఇలా ఒకర్ని అసౌకర్యానికి గురి చేయడం నీచమైన పని అంటూ తన ఆవేదనను సోషల్ మీడియా ద్వారా తెలియచేసింది.

సాయిపల్లవి సినిమాల విషయానకి వస్తే.. నాగచైతన్యకు జంటగా నటిస్తుంది. ఈ చిత్రానికి చందు మొండేటి డైరెక్టర్. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భారీ పాన్ ఇండియా మూవీగా రూపొందించే ఈ చిత్రాన్ని దాదాపు 80 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. అక్టోబర్ నెలాఖరున లేదా నవంబర్ ఫస్ట్ వీక్ నుంచి ఈ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకురానున్నారు. గతంలో చైతన్య, సాయిపల్లవి కలిసి లవ్ స్టోరీ సినిమా చేయడం సక్సెస్ అవ్వడంతో ఈ మూవీ పై మరింత క్రేజ్ ఏర్పడింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్