Saturday, March 14, 2026
Homeసినిమాచరణ్‌ కోసం రంగంలోకి దిగిన సల్మాన్.

చరణ్‌ కోసం రంగంలోకి దిగిన సల్మాన్.

రామ్ చరణ్‌ ‘జంజీర్’ మూవీతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాలో ప్రియాంకా చోప్రా నటించింది. పవర్ ఫుల్ పోలీసాఫీసర్ స్టోరీగా రూపొందిన జంజీర్ మూవీ బాలీవుడ్ లో డిజాస్టర్ అయ్యింది. అప్పటి నుంచి చరణ్‌ బాలీవుడ్ వైపు చూడలేదు. ఇటీవల ‘ఆర్ఆర్ఆర్’ మూవీ హిందీలో కూడా రిలీజ్ అవ్వడం.. అక్కడ సంచలన విజయం సాధించడంతో మళ్లీ హిందీలో సినిమాలు చేయాలి అనుకుంటున్నాడు చరణ్‌. అయితే.. ప్రస్తుతం చరణ్‌ శంకర్ తో ఓ మూవీ, బుచ్చిబాబుతో ఓ మూవీ చేసేందుకు ఓకే చెప్పాడు.

ఆర్ఆర్ఆర్ మూవీలో చరణ్‌ అల్లూరి సీతారామరాజుగా అద్భుతంగా నటించడంతో బాలీవుడ్ మేకర్స్ చరణ్ తో సినిమా చేయాలి అనుకుంటున్నారు. బాలీవుడ్ లో చరణ్ ఫ్రెండ్ అంటే ఠక్కున గుర్తొచ్చేది సల్మాన్ ఖాన్. వీరిద్దరూ ఎంత మంచి ఫ్రెండ్సో ‘గాడ్ ఫాదర్’ మూవీతో మరోసారి తెలిసింది. చిరంజీవి మూవీలో గెస్ట్ రోల్ చేయమని చరణ్‌ అడిగితే… రెమ్యూనరేషన్ లేకుండా సల్మాన్ చేశారు. ఆతర్వాత పారితోషికం ఇవ్వకపోయినా.. సల్మాన్ కి ఓ భారీ బహుమతి ఇచ్చాడు చరణ్‌. వీరిద్దరి ఫ్రెండ్ షిప్ గురించిన బాలీవుడ్ జనాలు.. చరణ్ తో సినిమా చేయడం కోసం సల్మాన్ కి కాంటాక్ట్ చేస్తున్నారట.

స‌ల్మాన్ కూడా చ‌ర‌ణ్ కోసం క‌థ‌లు వింటున్నాడ‌ని, త‌న‌కు న‌చ్చిన క‌థ‌లు చ‌ర‌ణ్‌కి పంపుతున్నాడ‌ని ఇన్ సైడ్ వ‌ర్గాల టాక్‌. చ‌ర‌ణ్ కి బాలీవుడ్ లో సినిమా చేయాల‌ని ఉన్నా.. అది ఇప్ప‌ట్లో కుద‌ర‌ని విష‌యం. ఎందుకంటే.. శంక‌ర్ సినిమా లైన్ లో ఉంది. ఆ త‌ర‌వాత‌.. బుచ్చిబాబు సినిమా మొద‌లెట్టాలి. మ‌రో వైపు ప్ర‌శాంత్ నీల్ లాంటి ద‌ర్శ‌కులు కూడా చ‌ర‌ణ్ కోసం క‌థ‌లు సిద్ధం చేస్తున్నారు. వీటిలో ఏదైనా ప్రాజెక్టు డీలే అయితే మాత్రం… అప్పుడు బాలీవుడ్ సినిమా చేసే అవ‌కాశం ఉంది. మరి.. చరణ్‌ బాలీవుడ్ డైరెక్టర్స్ లో ఎవరితో సినిమా చేస్తాడో చూడాలి.

Also Read : చరణ్‌ మూవీలో జాన్వీ. ఇది నిజమా..? 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular