Monday, June 17, 2024
Homeసినిమాచిరు, బాలయ్య మల్టీస్టారర్..?

చిరు, బాలయ్య మల్టీస్టారర్..?

ఎన్టీఆర్, ఎఎన్ఆర్.. ఇద్దరూ నువ్వా, నేనా అన్నట్టుగా పోటీ పడ్డారు. అంతలా పోటీ పడినప్పటికీ… దాదాపు 15 సినిమాల్లో కలిసి నటించారు. ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుని సంచలన విజయాలు సాధించారు. అలాగే కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు.. కూడా పోటీపడ్డారు. వీరు కూడా కలిసి నటించారు. అయితే.. ఆతర్వాత తరంలో మాత్రం చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ కలిసి సినిమాలు చేయలేదు. నేటి తరంలో యంగ్ హీరోలు కలిసి సినిమాలు చేసేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ మూవీలో ఎన్టీఆర్, చరణ్ కలిసి నటించడం ఓ సంచలనం.

అయితే… చిరంజీవి,బాలకృష్ణ వీరిద్దరూ కలిసి నటిస్తే.. సంచలనమే. ఈ భారీ క్రేజీ సినిమాను నిర్మించాలి అని అల్లు అరవింద్ అనుకుంటున్నారు. ఈ విషయాన్ని స్వయంగా అల్లు అరవింద్ తెలియచేయడం విశేషం. ఇంతకీ మేటర్ ఏంటంటే… ‘ఆహా’ కోసం బాలయ్య ‘అన్ స్టాపబుల్’ అనే టాక్ షో చేస్తున్నారు. ఫస్ట్ సీజన్ సూపర్ సక్సెస్ అయ్యింది. ఇప్పుడు సెకండ్ సీజన్ జరుగుతుంది. అయితే.. లేటెస్ట్ ఎపిసోడ్ కి అల్లు అరవింద్, సురేష్ బాబులు వచ్చారు. ఈ స్పెషల్ ఎపిసోడ్ కి సంబంధించి ప్రొమో రిలీజ్ చేశారు.

ఇందులో అల్లు అరవింద్.. చిరంజీవి గారితో మీతో కలిసి మల్టీస్టారర్ చేయాలి అనుకుంటున్నాను అని బాలయ్యకు చెప్పడం.. బాలయ్య.. మేమిద్దరం కలిసి సినిమా చేస్తే.. అది పాన్ ఇండియా కాదు.. పాన్ వరల్డ్ మూవీ అవుతుంది అనడం ఆసక్తిగా మారింది. ఈ ప్రొమో రిలీజ్ చేసినప్పటి నుంచి అటు మెగా అభిమానులు ఇటు నందమూరి అభిమానులు ఈ భారీ, క్రేజీ మూవీ సెట్ అయితే.. బాగుంటుంది అనుకుంటున్నారు. అల్లు అరవింద్ తలుచుకుంటే.. ఎలాంటి భారీ చిత్రాన్నైనా నిర్మించగలరు. మరి… ఈ క్రేజీ మల్టీస్టారర్ సెట్ అవుతుందేమో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్