Saturday, March 7, 2026
Homeసినిమా ''నేను స్టూడెంట్ సార్!' లో సముద్రఖని

 ”నేను స్టూడెంట్ సార్!’ లో సముద్రఖని

బెల్లంకొండ గణేష్ యాక్షన్ థ్రిల్లర్ ”నేను స్టూడెంట్ సార్!’. ఎస్వీ2 ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో ప్రొడక్షన్ నంబర్ 2 గా వస్తున్న ఈ చిత్రాన్ని ‘నాంది’ సతీష్ వర్మ నిర్మిస్తుండగా నూతన దర్శకుడు రాకేష్ ఉప్పలపాటి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రొడక్షన్ బ్యానర్ నుండి వచ్చిన మొదటి సినిమా ‘నాంది ’ లానే ‘నేను స్టూడెంట్ సార్!’ కూడా యూనిక్ సబ్జెక్ట్ తో కూడిన కంటెంట్ రిచ్ మూవీ. దర్శకుడు కృష్ణ చైతన్య కథను అందించారు.

ముందుగా కథానాయకుడు గణేష్, కథానాయిక అవంతిక దాసాని ఫస్ట్ లుక్స్ ని ఆవిష్కరించారు. ఈ చిత్రంలో అర్జున్ వాసుదేవన్‌గా నటిస్తున్న సముద్రఖని ఫస్ట్ లుక్‌ను ఈ రోజు విడుదల చేశారు. పాత్ర పేరు సూచించినట్లుగా, హీరోయిన్ అవంతిక తండ్రిగా కనిపించనున్నారు. అవంతిక పాత్ర పేరు శృతి వాసుదేవన్ గా ఇదివరకే పరిచయం చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్ లో సీరియస్ గా నడిచివస్తున్న పోలీసు అధికారిగా కనిపించారు. సముద్రఖని వెనుక పెద్ద సంఖ్యలో విద్యార్ధుల సమూహం కూడా గమనించవచ్చు.

ఈ సినిమాలో సునీల్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు. అనిత్ మధాడి డీవోపీగా, చోటా కె ప్రసాద్ ఎడిటర్ గా పని చేస్తున్నారు. కళ్యాణ్ చక్రవర్తి ఈ చిత్రానికి డైలాగ్స్ అందిస్తున్నారు. సినిమా షూటింగ్ మొత్తం పూర్తయింది. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. మేకర్స్ త్వరలో విడుదల తేదీని ప్రకటించ‌నున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular