Friday, June 12, 2026
Homeసినిమాఅనంతపురంలో ‘వీరసింహారెడ్డి’ షూటింగ్

అనంతపురంలో ‘వీరసింహారెడ్డి’ షూటింగ్

నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేనిల మాస్ యాక్షన్ ఎంటర్‌ టైనర్ ‘వీరసింహారెడ్డి’.  ఈ సినిమాకు సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రేపటి నుండి అనంతపురంలో షూటింగ్ షెడ్యూల్ ప్రారంభం కానుంది. పెన్నా అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం, ఉరవకొండ, పెనుగొండ ఫోర్ట్ తదితర ప్రదేశాల్లో చిత్రానికి సంబధించిన కీలక సన్నివేశాలని చిత్రీకరించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకం పై భారీ ఎత్తున రూపొందుతున్న ఈ చిత్రంలో శృతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. దునియా విజయ్, వరలక్ష్మి శరత్‌కుమార్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఎస్. ఎస్. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. రిషి పంజాబీ సినిమాటోగ్రఫర్ గా పని చేస్తున్నారు. నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి స్టార్ రైటర్ సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ అందించగా, నవీన్ నూలి ఎడిటర్ గా, ఎ ఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నారు. చందు రావిపాటి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి ఫైట్ మాస్టర్స్ గా రామ్-లక్ష్మణ్ పని చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, టైటిల్ టీజర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఎప్పుడెప్పుడా అని ప్రేక్షకులు భారీ అంచనాలతో ఎదురుచూస్తున్న ‘వీరసింహారెడ్డి’ 2023 సంక్రాంతికి ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌ గా విడుదల కానుంది.

Also Read : ‘వీరసింహారెడ్డి’ స్టోరీ ఇదేనా 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular