Tuesday, March 17, 2026
Homeసినిమాభారీ ఫైట్ షూటింగ్ లో 'వీరసింహారెడ్డి'

భారీ ఫైట్ షూటింగ్ లో ‘వీరసింహారెడ్డి’

బాలకృష్ణ, గోప్‌చంద్ మలినేనిల మాస్ యాక్షన్ ఎంటర్‌ టైనర్ ‘వీరసింహారెడ్డి‘ టైటిల్ పోస్టర్‌ తో అందరినీ అలరించింది. ప్రస్తుతం బాలకృష్ణ, విలన్ బ్యాచ్‌ పై ఉత్కంఠభరితమైన భారీ పోరాట సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారు. కథలో కీలకమైన సమయంలో రానున్న ఈ యాక్షన్ ఎపిసోడ్ ని దర్శకుడు అద్భుతమైన రీతిలో తెరకెక్కిస్తున్నారు. ఫైట్ మాస్టర్ వెంకట్ ఫైట్ సీక్వెన్స్‌ని పర్యవేక్షిస్తున్నారు. సినిమాకు సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

ఈ చిత్రం కథ యదార్థ సంఘటనల ఆధారంగా రూపుదిద్దుకుంటోంది. మైత్రీ మూవీ పై భారీ ఎత్తున రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్‌లో శృతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రంలో దునియా విజయ్, వరలక్ష్మి శరత్‌కుమార్ ఇతరకీలక పాత్రలు పోషిస్తున్నారు. బాలకృష్ణ ,గోపీచంద్ చిత్రాలకు బ్లాక్ బస్టర్ ఆల్బమ్‌లను అందించిన సంగీత సంచలనం ఎస్ థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. రిషి పంజాబీ సినిమాటోగ్రఫర్ గా పని చేస్తున్నారు.

మైత్రీ మూవీ మేకర్స్ పతాకం పై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు. స్టార్ రైటర్ సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ అందించగా, నవీన్ నూలి ఎడిటర్ గా, ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నారు. చందు రావిపాటి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి ఫైట్ మాస్టర్స్ గా రామ్-లక్ష్మణ్ పని చేస్తున్నారు. వీరసింహారెడ్డి 2023 సంక్రాంతికి ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.

Also Read : వీరయ్యతో పోటీకి సై అంటున్న బాలయ్య.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular