Monday, January 20, 2025
HomeTrending Newsగంజాయి పేరుతో కొత్త నిందలు: విజయసాయి

గంజాయి పేరుతో కొత్త నిందలు: విజయసాయి

గత ఏడాది దేశంలో పట్టుబడిన  గంజాయి విషయంలో విపక్షాలు ప్రభుత్వంపై లేనిపోని విమర్శలు చేస్తున్నారని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి. విజయసాయిరెడ్డి విమర్శించారు.  గంజాయి అరికట్టడంలో ప్రభుత్వం సమర్ధవంతంగా పని చేస్తుంది కాబట్టే  ఇంత పెద్ద మొత్తంలో  పట్టుకోగలిగిందని, ఇది  ప్రభుత్వం పనితీరుకు నిదర్శనమని పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాల్లో ఈ మేరకు స్పందించారు.

‘దేశంలో 2021లో పట్టుబడిన గంజాయి (7,49,761 కిలోలు)లో 2,00,588 కిలోలు ఆంధ్రప్రదేశ్‌లో దొరికింది. ఈ విషయంలో రెండో స్థానం పొరుగునున్న ఒడిశాది (1,71,713 కిలోలు). ప్రభుత్వ నిఘా సంస్థలు స్వాధీనం చేసుకున్న గంజాయిలో సగం వరకూ ఈ రెండు రాష్ట్రాల్లోనే పట్టుబడింది.’ ఇది ఇటీవల నార్కొటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్సీబీ–మాదకద్రవ్యాల నియంత్రణ సంస్థ) తన వార్షిక నివేదికలో ఇచ్చిన సమాచారం. దీన్ని పట్టుకుని ఏపీ ప్రభుత్వంపై తెలుగుదేశం అనుకూల మీడియా నిందలు వేయడం ప్రారంభించింది. మూడున్నరేళ్లుగా ప్రజాసంక్షేమమే పరమావధిగా పరిపాలిస్తున్న వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గారి నేతృత్వంలోని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వంపై విరుచుకుపడడానికి ఈ కొద్దిపాటి సమాచారం పెద్ద ఆయుధంగా దొరికినట్టు టీడీపీ అనుకూల మీడియా సంబరపడిపోతోంది. వాస్తవానికి, విశాఖ అటవీ ప్రాంతం (ఏజెన్సీ), దానికి ఆనుకుని ఉన్న ఒడిశా రాష్ట్రంలోని పర్వతాలు, అటవీ ప్రాంతాలు ఎన్నో దశాబ్దాలుగా గంజాయి సాగుకు అనువైన ప్రదేశాలేగాక, అనేక మాదకద్రవ్యాల తయారీకి ఉపకరించే గంజాయి ఉత్పత్తి చెప్పుకోదగ్గ స్థాయిలో జరుగుతున్న ఏరియాలుగా పేరుమోశాయి. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం (ఎన్సీబీతో కలిసి ఏపీ ఎక్సైజ్, అటవీ శాఖలు) 2019 నుంచీ నిరంతరం తీసుకుంటున్న కట్టుదిట్టమైన నిఘా చర్యల ఫలితంగా పెద్ద మొత్తాల్లో రవాణాకు సిద్ధంగా ఉన్న గంజాయిని నేరస్తుల నుంచి స్వాధీనం చేసుకోగలిగారు. కాని, ఇంత భారీ పరిమాణంలో గంజాయిని పట్టుకోవడం రాష్ట్ర సర్కారు సాధించిన విజయంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ వ్యతిరేక శక్తులకు కనపడడం లేదు. కేవలం పట్టుబడిన గంజాయి ఆధారంగా జగన్‌ ప్రభుత్వంపై బురద చల్లడానికి సిద్ధమయ్యాయి టీడీపీ సహా ఇతర ప్రతిపక్షాలు.”

ఏడేళ్ల క్రితమే గంజాయి సాగు కేరళ, తమిళనాడులో తగ్గి తూర్పు తీరానికి చేరింది.  అటవీ,  కొండ ప్రాంతాలు, ఇతర భౌగోళిక, భౌతిక పరిస్థితులను గమనించకుండా ఎన్సీబీ వార్షిక నివేదిక (2021)లోని రెండు పాయింట్లను పట్టుకుని టీడీపీ అనుకూల ప్రచారసాధనాలు రాష్ట్ర ప్రభుత్వంపై వేసే నిందలను ఆరు కోట్ల ఆంధ్రులు నమ్మరని గుర్తిస్తే మంచిది. ప్రభుత్వం స్వాధీనమైన గంజాయి పరిమాణమే సర్కారు పనితీరుకు గీటురాయి” అని స్పందించారు.

Also Read: రైల్వే జోన్ రాకపోతే రాజీనామా : విజయసాయి

RELATED ARTICLES

Most Popular

న్యూస్