Thursday, April 25, 2024
HomeTrending Newsమహాత్ముడి స్ఫూర్తితో..కరోనాపై యుద్ధం - కెసిఆర్

మహాత్ముడి స్ఫూర్తితో..కరోనాపై యుద్ధం – కెసిఆర్

సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌ నగరంలోని గాంధీ ఆసుపత్రిలో మహాత్ముడి 16 అడుగుల విగ్రహాన్ని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం కేసీఆర్‌ మాట్లాడారు. ‘గాంధీ ఆసుపత్రిలో మహాత్ముడి విగ్రహాన్ని గొప్పగా ప్రతిష్టింపజేయడం చాలా గొప్ప విషయం. శ్రీనివాస్‌ యాదవ్‌, ఆయన మిత్రులందరికీ చిరస్థాయిగా కీర్తిదక్కుతుంది. కరోనా మహమ్మారి యావత్‌ ప్రపంచాన్ని దడదడలాంచిన సందర్భంలో రాష్ట్రంలో రాజధాని నడిబొడ్డున అత్యంత ధైర్యంగా, బలోపేతంగా ప్రజల ప్రాణాలను కాపాడుతామని ధైర్యంగా పని చేసిన సంస్థ మన గాంధీ ఆసుపత్రి. ఇక్కడి వైద్యులు, వైద్య బృందం, ఆనాటి సూపరింటెండెంట్‌ నాయకత్వంలో చేసిన వైద్యులు, నర్సులు, సిబ్బంది, పారామెడికల్‌ సిబ్బంది అందరూ గాంధీ ఆదర్శాన్ని, ఆయన ఇచ్చిన ధైర్యాన్ని పుణికిపుచ్చుకొని.. హాస్పిటల్‌కు గాంధీ పేరుంది కాబట్టి.. వారి పేరు నిలబెట్టాలని.. కరోనా మహమ్మారి సమయంలో యుద్ధం చేశారు’ అని సీఎం కేసీఆర్‌ ప్రశంసించారు.

ఆసుపత్రి సిబ్బందికి సెల్యూట్‌ చేస్తున్నా..
‘వసతులు ఉన్నా లేకున్నా.. పీపీఈ కిట్స్‌ ఉన్నా లేకున్నా.. చాలా ధైర్యంగా పని చేశారు. ప్రైవేటు ఆసుపత్రులు పేషెంట్లను రిజెక్ట్‌ చేస్తే ఇక్కడికి తీసుకువస్తే ప్రాణాలను కాపాడిన ఘనత గాంధీ ఆసుపత్రి సిబ్బందికి దక్కుతుంది. గాంధీ స్ఫూర్తిని నింపుకొని పని చేసిన వైద్యశాఖ మంత్రి హరీశ్‌రావు, ఆసుపత్రి సిబ్బందికి సెల్యూట్‌ చేస్తున్నా. మంచి జరిగితే ఎంత ప్రశంస వస్తుందో దీన్నిబట్టి అర్థమవుతుంది. గాంధీ ధ్యానమూర్తి ఓ అద్భుతమైన ఆవిష్కరణ. రాష్ట్రానికే గర్వకారణం. ధాన్యంలో ఆయన ఈ ప్రపంచంలో ఉన్న సమస్త మానవాళి, ఆరోగ్యంగా, శాంతితో, సౌభ్రాతృత్వంతో అద్భుతంగా పురోగమించాలని ఆ సర్వేశుడిని ప్రార్థిస్తున్నట్లుగా గాంధీ విగ్రహం కనిపిస్తున్నది’ అని పేర్కొన్నారు.

Also Read: యాదాద్రిలో సీఎం కేసీఆర్‌ ప్రత్యేక పూజలు

RELATED ARTICLES

Most Popular

న్యూస్