Saturday, April 20, 2024
HomeTrending Newsపొల్యూషన్‌ సర్టిఫికెట్‌ లేకుంటే నో పెట్రోల్‌

పొల్యూషన్‌ సర్టిఫికెట్‌ లేకుంటే నో పెట్రోల్‌

న్యూఢిల్లీలో వాహన కాలుష్యాన్ని తగ్గించేందుకు దిల్లీ సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది. పొల్యూషన్‌ సర్టిఫికెట్‌ లేకపోతే పెట్రోల్‌ బంకుల వద్ద చమురు నిరాకరించనున్నారు. దేశ రాజధానిలో వాహన కాలుష్యాన్ని తగ్గించేందుకు ఢిల్లీ సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై చెల్లుబాటు అయ్యే పొల్యూషన్‌ సర్టిఫికెట్‌ (పీయూసీ- పొల్యూషన్‌ అండర్‌ కంట్రోల్‌) చూపించకుంటే పెట్రోల్‌ బంకుల్లో చమురు ‘పోసేదే లే’ అని ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్‌ రాయ్‌ స్పష్టంచేశారు. అక్టోబర్‌ 25 నుంచి ఈ విధానం అమల్లోకి రానుందని చెప్పారు. పర్యావరణ, రవాణా, ట్రాఫిక్‌ విభాగాలకు చెందిన అధికారులతో సమావేశం అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. త్వరలోనే దీనికి సంబంధించిన విధివిధానాలు ఖరారు చేస్తూ నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఢిల్లీలో కాలుష్యం పెరగడానికి వాహన కాలుష్యం కూడా ఒకటని గోపాల్‌ రాయ్‌ అన్నారు. అందుకే ఎక్కువ కాలుష్యం ఉన్న వాహనాలు రోడ్లపై తిరగకుండా నిరోధించే ఉద్దేశంతో ఈ నిబంధన తీసుకొస్తున్నట్లు గోపాల్‌ రాయ్‌ తెలిపారు.

ఢిల్లీ రవాణా శాఖ ప్రకారం..

2022 జులై నాటికి సుమారు 13 లక్షల ద్విచక్రవాహనాలు, 3 లక్షల కార్లు సహా మొత్తం 17 లక్షల వాహనాలు చెల్లుబాటయ్యే పీయూసీ సర్టిఫికెట్‌ లేకుండానే దేశ రాజధాని రోడ్లపై సంచరిస్తున్నాయన్న అంచనా. ఒకవేళ పొల్యూషన్‌ సర్టిఫికెట్‌ లేకుండా పట్టుబడితే మోటారు వాహనాల చట్టం ప్రకారం ఆరు నెలల వరకు జైలు శిక్ష లేదా రూ.10 వేల వరకు జరిమానా విధించొచ్చు. కొన్ని సందర్భాల్లో రెండూ విధించొచ్చు. ‘నో పీయూసీ.. నో ఫ్యూయల్‌’పై ఈ ఏడాది మార్చి 3న ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకున్నామని, ఎక్కువ మంది దీన్ని అమలుకు మొగ్గు చూపడంతో ఈ విధానం తీసుకొస్తున్నామని రాయ్‌ వెల్లడించారు. గతంలో కాలుష్య నివారణకు ఢిల్లీ లోని ఆప్‌ సర్కారు సరి-బేసి విధానాన్ని అమలు చేసిన సంగతి తెలిసిందే.

Also Read: పెట్రో పన్నులతో మోడీ నయవంచన కేటీఆర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్