Loss to Nation:
తమిళనాడులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. భారత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సిడిఎస్) బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదవశాత్తూ కూనూరు అటవీ ప్రాంతంలో కుప్పకూలింది. కోయంబత్తూర్, కూనూరు మధ్యలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. హెలికాప్టర్‌లో బిపిన్ రావత్‌తో పాటు ఆయన భార్య మధులిక, వ్యక్తిగత సిబ్బంది కలిసి మొత్తం 14 మంది ఉన్నారు. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం 11 మంది మరణించారు. సమాచారం అందుకున్న వెంటనే ఆర్మీ, పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని పెద్దఎత్తున సహాయక చర్యలు చేపట్టారు. ఆర్మీ అధికారులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు రావత్ కూనూరు వెళ్ళినట్లు తెలిసింది. కూనూరు నుంచి వెల్లింగ్టన్ ఆర్మీ బేస్ క్యాంప్ కు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.
చీఫ్ అఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ తో సహా పలువురు అధికారులు పయనిస్తున్న ఐఎఎఫ్ ఎంఐ – 17వి5 హెలికాఫ్టర్ క్రాష్ అయినట్లు ఆర్మీ ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. ఈ ప్రమాదానికి గల కారణాలపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించినట్లు ప్రకటించింది.
Also Read : కూనూరులో కూలిన డిఫెన్స్ హెలికాఫ్టర్