కేంద్ర క్యాబినెట్ నుంచి 12 మంది మంత్రులు రాజీనామా చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సూచనతో ఈ రాజీనామాలను ఆమోదిస్తున్నట్లు రాష్ట్రపతి భవన్ ఓ ప్రకటనలో తెలియజేసింది.
రాజీనామా చేసిన క్యాబినెట్ మంత్రులలో…..
- డి.వి. సదానంద గౌడ (ఎరువులు, రసాయనాలు)
- రవి శంకర్ ప్రసాద్ (ఐటి, కమ్యూనికేషన్స్, న్యాయం)
- ప్రకాష్ జవ దేకర్ (సమాచార, ప్రసార; అటవీ,పర్యావరణం; భారీ పరిశ్రమలు)
- రమేష్ పోక్రియాల్ (విద్య)
- డా. హర్ష వర్ధన్ (ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం)
- తావర్ చంద్ గెహ్లాట్ (సామాజిక న్యాయం, సాధికారత)
స్వతంత్ర హోదాతో సహాయ మంత్రి:
- సంతోష్ గంగ్వార్ ( కార్మిక, ఉపాధి కల్పన)
సహాయ మంత్రులు
- బాబు సుప్రియో (అటవీ, పర్యావరణం)
- దోత్రే సంజయ్ (విద్య)
- రతన్ లాల్ కటారియా (జల శక్తి)
- ప్రతాప్ చంద్ర సారంగి (సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు)
- దేబశ్రీ చౌదురి (స్త్రీ, శిశు సంక్షేమం)