Friday, April 19, 2024
HomeTrending NewsTS SPDCLలో 1271 పోస్టులు.. 11న నోటిఫికేషన్‌

TS SPDCLలో 1271 పోస్టులు.. 11న నోటిఫికేషన్‌

తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ టీఎస్‌ ఎస్‌పీడీసీఎల్‌ (TS SPDCL) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది. ఆన్‌లైన్‌ దరఖాస్తులు ఈ నెల 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 1271 పోస్టులను భర్తీ చేస్తున్నది. ఇందులో జూనియర్‌ లైన్‌మెన్‌, సబ్‌-ఇంజినీర్ అసిస్టెంట్‌ ఇంజినీర్‌ పోస్టులు ఉన్నాయి. పూర్తిస్థాయి నోటిఫికేషన్‌ బుధవారం (మే 11) విడుదల కానుంది. అదేరోజు దరఖాస్తు ప్రక్రియ ఆరంభమవుతున్నది.
మొత్తం ఖాళీలు: 1271
ఇందులో జూనియర్‌ ఇంజినీర్‌ 1000, సబ్‌ ఇంజినీర్‌/ఎలక్ట్రికల్‌ 201, అసిస్టెంట్‌ ఇంజినీర్‌/ఎలక్ట్రికల్‌ 70 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: సంబంధిత విభాగంలో ఐటీఐ, బీఈ, బీటెక్‌ చేసి ఉండాలి.
వెబ్‌సైట్‌: https://tssouthernpower.com, www.tssouthernpower.cgg.in

RELATED ARTICLES

Most Popular

న్యూస్