Saturday, April 20, 2024
HomeTrending Newsఘనంగా ఐల‌మ్మ 127వ జ‌యంతి వేడుకలు

ఘనంగా ఐల‌మ్మ 127వ జ‌యంతి వేడుకలు

చిట్యాల ఐల‌మ్మ కేవ‌లం కులానికి మాత్ర‌మే కాద‌ని యావ‌త్ తెలంగాణ జాతీ ఆస్థి అని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్ అన్నారు. హైదరాబాద్ ర‌వీంద్ర‌భార‌తిలో ఈ రోజు ప్ర‌భ‌త్వ ఆధ్వ‌ర్యంలో ఘ‌నంగా నిర్వ‌హించిన చిట్యాల ఐల‌మ్మ 127వ జ‌యంతి వేడుక‌ల్లో స‌హ‌చ‌ర మంత్రి త‌ల‌సాని, ఎమ్మెల్సీ బ‌స్వ‌రాజు సారయ్య ఇత‌ర ఉన్న‌తాధికారులు, బీసీ ప్ర‌జ‌ల స‌మ‌క్షంలో ఘ‌నంగా జ‌యంతి నివాళులు అర్పించారు. ఈ సంద‌ర్బంగా మాట్లాడుతూ ఐల‌మ్మ స్పూర్తితోనే గౌర‌వ ముఖ్య‌మంత్రి కేసీఆర్ తెలంగాణ పోరాటం సాగించార‌న్నారు. నాడు తీవ్ర వివ‌క్ష‌ను ఎదిరించి ఆత్మ‌గౌర‌వం కోసం నిజాంకు వ్య‌తిరేకంగా బందూకును చేత‌ప‌ట్టి సాయుద పోరాటం చేసింద‌ని, వెట్టిచాకిరి, వివ‌క్ష‌త‌ల‌ను తెలంగాణ నుండి పార‌ద్రోలేందుకు చిట్యాల ఐల‌మ్మ పోరాటం దోహదం చేసింద‌న్నారు మంత్రి గంగుల‌. ఎక్క‌డైతే ఐల‌మ్మ చావు కోసం రివార్డు ప్ర‌క‌టించారో అదే తెలంగాణ నేల‌పై ఈరోజు అధికారికంగా 127వ జ‌యంతి ఉత్స‌వాల‌ను నిర్వ‌హించుకోవ‌డం తెలంగాణ‌లో మాత్ర‌మే సాధ్య‌మ‌న్నారు.

చిట్యాల ఐల‌మ్మ తెలంగాణ త‌ల్లి అని, అదే స్పూర్తితో ప్ర‌భుత్వం ప‌నిచేస్తుంద‌న్నారు. నాటి పాల‌కుల నిర్ల‌క్ష్యం వ‌ల్ల వెనుక‌కునెట్టేయ‌బ‌డ్డ బ‌ల‌హీన‌వ‌ర్గాల‌కు సీఎం కేసీఆర్ నేత్రుత్వంలో ఆత్మ‌గౌర‌వం వెల్లివిరుస్తుంద‌న్నారు. నాడు 19 గురుకులాలు 7500 మంది విధ్యార్థులుంటే నేడు 310 గురుకులాలు 1,65,400 మంది విధ్యార్థుల‌కు ప్ర‌పంచ‌స్థాయి ప్ర‌మాణాల‌తో విద్య‌న‌బ్య‌సిస్తున్నార‌న్నారు. కుల‌ వృత్తులు చేసుకొనే ప్ర‌తీ త‌ల్లిదండ్రీ త‌మ బిడ్డ‌ల్ని ఇంగ్లీష్ మీడియంలో చ‌దివిస్తూ గ‌ర్వంగా జీవిస్తున్నార‌న్నారు. కులవృత్తులు చేసుకునే వారికి సైతం తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు మంత్రి గంగుల కమలాకర్, ఏ ఒక్కరు అడగకుండానే రజకులకు, నాయి బ్రాహ్మణులకు 250 యూనిట్ల ఉచిత కరెంటు అందించారని దాదాపు లక్ష కుటుంబాలు దీని నుండి లబ్ధి పొందుతున్నారన్నారు, హైదరాబాదులోనే విలువైన ప్రాంతం మేడిపల్లిలో రెండు ఎకరాలు ఐదు కోట్లను కేటాయించారన్నారు. సంచార జాతులు సహా యావత్ బీసీ కులాలకు వేల కోట్ల విలువైన 87 ఎకరాలు 95 కోట్లను కేటాయించారు అన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాలు, రజక సంఘాలు పెద్ద ఎత్తున హాజరైన ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశం, ఐలమ్మ జయంతి వేడుకల కమిటీ చైర్మన్ అక్క రాజు శ్రీనివాస్, వివిధ కుల సంఘాల నేతలు పాల్గొన్నారు.

Also Read : వీరవనిత ఐలమ్మకు సీఎం కేసీఆర్ నివాళి

RELATED ARTICLES

Most Popular

న్యూస్