Thursday, April 18, 2024
HomeTrending Newsఅంబేడ్కర్ జయంతి పోస్టరు విడుదల

అంబేడ్కర్ జయంతి పోస్టరు విడుదల

భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ 131వ జయంతి సందర్భంగా రూపొందించిన పోస్టరును షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆవిష్కరించారు. షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఏర్పాటు చేసిన డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ రాష్ట్ర స్థాయి జయంతి ఉత్సవాల కమిటీ ఈనెల 14వ తేదీన అంబేడ్కర్ జయంతిని ట్యాంక్ బండ్ సమీపాన ఉన్న వారి విగ్రహం వద్ద ప్రధాన కార్యక్రమాన్ని ఘనంగా జరుగనుంది

ఈ సందర్భంగా కమిటీ రూపొందించిన పోస్టరును మంత్రి శనివారం హైదరాబాద్ లోని తన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కమిటీ వర్కింగ్ ఛైర్మన్లు రావుల విజయ్ కుమార్,నాగారం బాబు మాదిగ, వైస్ ఛైర్మన్ ఏర్పుల యాదయ్య, ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్, నాయకుడు మేడి పాపయ్య తదితరులు పాల్గొన్నారు.

అంతకుముందు.. కార్పోరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR )లో భాగంగా హైదరాబాద్ జగద్గిరిగుట్టలోని గురుకుల పాఠశాల,కాలేజీ భవన నిర్మాణానికి 17కోట్లు మంజూరు చేసిన హైదరాబాద్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) . హెచ్ఎఎల్ అధికారులు నగరంలో శనివారం మంత్రి కొప్పులఈశ్వర్ ను కలిసి తమ అంగీకార పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో హెచ్ఎఎల్ జనరల్ మేనేజర్ అరుణ్ సర్కాటే, అధికారులు రాంకిశోర్, సురేందర్ జీ,జతీందర్ పాల్ కౌర్,ప్రహ్లాద్, గురుకుల విద్యా సంస్థల సొసైటీ అధికారులు హన్మంతు నాయక్, మామిడాల ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

Most Popular

న్యూస్